Nuzividu Triple IT: ట్రిపుల్‌ ఐటీ లో వెయ్యి మందికి పైగా విద్యార్థులకు అస్వస్థత!

నూజివీడు ట్రిపుల్ ఐటీ లో గత నాలుగు రోజులుగా విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురౌతున్నారు. ఇప్పటి వరకు 1000 మందికి పైగా విద్యార్థులు వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరారు.

New Update
Nuzividu Triple IT: ట్రిపుల్‌ ఐటీ లో వెయ్యి మందికి పైగా విద్యార్థులకు అస్వస్థత!

Nuzividu: నూజివీడు ట్రిపుల్ ఐటీ లో పరిశుభ్రత పడకేసింది. నాసిరకం ఆహారం తిన్న విద్యార్థులు ఆసుపత్రుల పాలయ్యారు. గత వారం రోజుల నుంచి సుమారు వెయ్యి మందికి పైగా విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నాసిరకం ఆహారం తినడం వల్ల విద్యార్థులంతా కూడా వాంతులు, విరేచనాలు, తీవ్రమైన కడుపునొప్పితో ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు.

విద్యార్థులు ఇన్ని అవస్థలు పడుతున్నప్పటికీ ట్రిపుల్ ఐటీ యజమాన్యం మాత్రం నిమ్మకు నీరేత్తినట్లు వ్యవహరిస్తుంది. ఈ విషయాన్ని బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇదే ప్రాంగణంలో శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీని కూడా నిర్వహిస్తున్నారు. రెండు ట్రిపుల్ ఐటీల విద్యార్థులు కూడా తీవ్ర అస్వస్థతకు గురౌతున్నారు.

గత నాలుగు రోజులుగా అస్వస్థతకు గురౌతున్న విద్యార్థులు సంఖ్య రోజురోజుకి పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. వెయ్యి మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురైతే యాజమాన్యం మాత్రం కేవలం 400 మంది విద్యార్థులను మాత్రమే లెక్కల్లో చూపుతున్నారు. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు కూడా ప్రాంగణంలోని మెస్‌ లను పరిశీలించడానికి వెళ్లలేదని సమాచారం.

ఈ విషయం తెలిసిన మంత్రి లోకేశ్‌ వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించాను. విద్యార్థులు ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం తగదని తెలిపారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని అంటూ ట్విట్టర్లో తెలిపారు.

దీంతో అధికారులు స్పందంచారు. డీఎంహెచ్‌వో షర్మిష్ఠ ట్రిపుల్‌ ఐటీ మెస్‌లు, ఆసుపత్రిని సందర్శించారు. పరిశుభ్రత, ఆహార నాణ్యత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని గురించి ఉన్నతాధికారులు నివేదిక ఇస్తామని తెలిపారు.

ఈ విషయం గురించి తెలుసుకున్న వెంటనే రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి బుధవారం నూజివీడు ట్రిపుల్‌ ఐటీని సందర్శించారు. ముందుగా ప్రాంగణంలో ఉన్న ఫుడ్‌ కోర్టును పరిశీలించారు. నిల్వ మాంసం, బూజు పట్టిన ఆహార పదార్థాలు గుర్తించి నిర్వహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం గురించి రిజిస్ట్రార్‌ తో ఆయన మాట్లాడి విద్యార్థులు అనారోగ్యానికి గల కారణాలు తెలుసుకున్నారు. విద్యార్థుల వైద్య విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.

Also Read: ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఆ స్పెషల్ డేట్ కు ‘రాజా సాబ్’ టీజర్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Vontimitta Temple : ప్రతి భక్తుడికి ముత్యపు తలంబ్రాలు, అన్నప్రసాదాలు.

శ్రీరామ నవమి ఉత్సవాలకు ఒంటిమిట్ట ఆలయంలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏప్రిల్ 11న జరుగనున్న శ్రీ సీతారాముల కళ్యాణోత్సవానికి విచ్చేసే ప్రతి భక్తుడికి ముత్యపు తలంబ్రాలు, అన్నప్రసాదాలు అందించేలా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు టీటీడీ అధికారులు సమీక్ష చేసారు.

New Update
Vontimitta Temple

Vontimitta Temple

Vontimitta Temple : శ్రీరామనవమి వేడుకులకు దేశమంతా సిద్ధమైంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే తెలంగాణలో భద్రాచలం, ఆంధ్రప్రదేశ్‌లో ఒంటిమిట్ట దేవాలయాల్లో స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరగనుంది. కాగా శ్రీరామనవమి వేడుకలకు రెండు రాష్ట్రాలు ఘనంగా ఏర్పాట్లుచేస్తున్నాయి. శ్రీరామ నవమి ఉత్సవాలకు ఒంటిమిట్ట ఆలయంలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రతీ ఏటా ఈ ఆలయంలో వైభవంగా వేడుకలు నిర్వహిస్తారు. ఒంటిమిట్ట ఏకశిలానగరంలో ఏప్రిల్ 11న జరుగనున్న శ్రీ సీతారాముల కళ్యాణోత్సవానికి విచ్చేసే ప్రతి భక్తుడికి ముత్యపు తలంబ్రాలు, అన్నప్రసాదాలు అందించేలా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ముందస్తు ఏర్పాట్ల పైన టీటీడీ అధికారులు సమీక్ష చేసారు. అధికారులకు పలు సూచనలు ఇవ్వటంతో పాటుగా చేపట్టా ల్సిన చర్యల పైన దిశా నిర్దేశం చేసారు. 

ఇది కూడా చదవండి: వేయించిన ఆహారాలతో క్యాన్సర్‌ ముప్పు

క్షేత్ర స్థాయిలో అధికారులు పటిష్ట ప్రణాళికలు ఏర్పాటు చేసుకుని అమలు చేసేలా కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. కల్యాణ వేదిక ప్రాంగణం వద్ద ఉన్న 120 గ్యాలరీల లో ఉండే భక్తులతో పాటు, కల్యాణం వీక్షించేందుకు వచ్చిన భక్తులందరూ శ్రీ సీతారాముల కల్యాణోత్సవాన్ని వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కల్యాణ వేదిక ప్రవేశ ప్రారంభంలో తలంబ్రాలు పంపిణీ కోసం 16 కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. భారీగా రానున్న భక్తులు శ్రీ సీతారాముల కల్యాణోత్సవం తిలకించేలా 15 ఎల్ ఈడీ స్క్రీన్ లు, ఆలయం , కల్యాణ వేదిక, తదితర ప్రాంతాల్లో విద్యుత్ కాంతులతో 38 దేవతామూర్తుల విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులు సులువుగా గుర్తించేదెలా సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. 

ఇది కూడా చదవండి: లంగ్స్‌ బేషుగ్గా ఉండాలంటే తులసి ఆకులు నమలండి

విజిలెన్స్ శాఖ ఆధ్వర్యంలో 100 సిసి కెమెరాలు, 3 డ్రోన్ లు, 3 కంట్రోల్ రూమ్ లు, దాదాపు 2400 మంది భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. బ్రహ్మోత్స వాలకు దాదాపు 3 లక్షల తాగునీరు బాటిల్స్, 250 మంది పారామెడికల్ సిబ్బంది, 35 మంది వైద్య నిపుణులు, 13 మెడికల్ టీంలు, 8 అంబులెన్స్ లు, అగ్నిమాపక సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 

ఇది కూడా చదవండి: పప్పు ధాన్యాలు తినడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు తప్పవా?

 హెచ్ డి పీపీ - (18), దాస సాహిత్య ప్రాజెక్టు - (4,) అన్నమాచార్య ప్రాజెక్టు- (8) ఆధ్వర్యంలో మొత్తం 30 కళాబృందాలతో సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మొదటిసారి కళాకృతులుతో సంక్షిప్త రామాయణాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు, కల్యాణ వేదిక, ఆలయం, పరిసర ప్రాంతాల్లో 12 టన్నుల సాంప్రదాయ పుష్పాలు, లక్ష కట్ ఫ్లవర్స్ తో పుష్పాలంకరణలు చేస్తున్నట్లు తెలిపారు. కల్యాణోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరు కానున్నారు. ఒంటిమిట్టలో జరిగే ఈ కల్యాణోత్సవం తిలకించటానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రానున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి.

Also read :  నీ అభిమానం సల్లగుండా.. పవన్ కోసం రక్తం చిందించిన అభిమాని.. ఏం చేశాడంటే?

Advertisment
Advertisment
Advertisment