Gobi Manchuriyan : గోవాకు గోబీమంచురియాకు లింక్ ఏంటి..ఎందుకు బ్యాన్ చేసింది? గోవాలోని మపుసా అనే నగరం మాత్రం గోబీ మంచురియాను నిషేధించింది ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ గోబీ మంచూరియన్ అమ్మే స్టాళ్లను ఇక నుంచి పరిమిత స్థాయిలో ఉంచాలని గోవాలోని మోర్ముగావ్ మున్సిపల్ కౌన్సిల్ కు ఆదేశాలు జారీ చేసింది. By Bhavana 05 Feb 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి ''గోబీ మంచూరియన్'' పేరు చెబితేనే చాలా మందికి నోరూరుతుంది. స్పైసీ..స్పైసీగా చూస్తేనే కలర్ ఫుల్ గా ఉండే గోబీ మంచూరియాను చాలా మంది ఇష్టంగా తింటారు. చాలా మంది ఆహార ప్రియులు దీనిని ఎంతో ఇష్టంగా తింటారు. కానీ గోవాలోని ఓ నగరం మాత్రం మపుసా అనే నగరం మాత్రం గోబీ మంచురియాను నిషేధించింది. మపుసా నగరానికి పర్యాటకులు అధిక స్థాయిలో వస్తుంటారు. ఈ క్రమంలో అక్కడ ఆహార పదార్థాల వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలోనే అక్కడ గోబీ మంచూరియన్ అధికంగా దొరుకుతుంది. కొందరు పర్యాటకులు అక్కడి గోబీ మంచూరియాను తినడం వల్ల అనారోగ్యం బారిన పడినట్లు అధికారులకు సమాచారం వచ్చింది. దాంతో ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు నగరంలోని కొన్ని ఫుడ్ స్టాళ్ల పై నిఘా ఉంచగా..అక్కడ నిల్వ ఉన్న గోబీ బాల్స్ ను పర్యాటకులకు అందిస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ గోబీ మంచూరియన్ అమ్మే స్టాళ్లను ఇక నుంచి పరిమిత స్థాయిలో ఉంచాలని గోవాలోని మోర్ముగావ్ మున్సిపల్ కౌన్సిల్ కు ఆదేశాలు జారీ చేసింది. వాస్కో సప్తాహ్ ఫెయిర్ సందర్భంగా ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ గోబీ మంచూరియన్ స్టాల్స్ పై దాడులు చేసి పరిశుభ్రత , మంచూరియన్ లో వాడే సింథటిక్ రంగులు వాడకం వంటి వాటి గురించి ఆందోళనలు వ్యక్తం చేసింది. గోబీ మంచూరియన్ తయారు చేసే కొన్ని స్టాళ్ల పై దాడులు చేసి అపరిశుభ్రంగా ఉన్నవాటిని మూసివేసి కఠిన చర్యలు తీసుకుంది. గోబీ మంచూరియను చైనీస్ వంటకంగా చెప్పుకుంటారు. నెల్సన్ వాంగ్ 1970 లో క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియాలో క్యాటరింగ్ చేసే సమయంలో చికెన్ మంచూరియన్ ను తయారు చేయగా..కాలక్రమేణా అది గోబీ మంచూరియాను కూడా తయారు చేసేందుకు దారి తీసింది.చికెన్ మంచూరియన్ కు ప్రత్యామ్నాయం గోబీ మంచూరియన్. Also read: టీఎస్ ..టీజీ అయ్యింది..మరీ పాత వాళ్లు నెంబర్ ప్లేట్లు మార్చాలా? #goa #gobi-manchuriya #banned మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి