పడుకునే ముందు ఫోన్ వాడుతున్నారు?.. తస్మాత్ జాగ్రత్త!

మొబైల్ ఫోన్లు ఎక్కువగా వాడడం ద్వారా అనేక మంది నిద్రలేమి సమస్య బారిన పడుతున్నారని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజుకు 6 నుంచి 8 గంటల పాటు నిద్ర పోవాలని వైద్యులు సూచిస్తున్నారు. సరైన నిద్ర ఉంటేనే ఆరోగ్యంగా ఉంటామని వెల్లడించారు.

New Update
రాత్రిపూట ఇలాంటి పనులు చేస్తున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడ్టట్లే..!!

టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందుతుందో.. అన్ని ఆరోగ్య సమస్యలు ప్రజలను వెంటాడుతున్నాయి. ప్రస్తుతం కాలంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా చాలా మంది ఫోన్లకు బానిసలవుతున్నారు. సోషల్ మీడియా పుణ్యమా అని విద్యార్థులు పుస్తకాలను, తల్లిదండ్రులు పిల్లల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మర్చిపోతున్నారు. చుట్టూ ఉన్న చుట్టాలను మర్చిపోయి సోషల్ మీడియాలో కొత్త చుట్టాలను పెంచుకుంటున్నారు. ఒక రకంగా ఇది మంచికే అయినా.. కొందరి కుటుంబాల్లో చిచ్చులు రేపుతోంది ఈ సోషల్ మీడియా.

ALSO READ: కుదిరిన కాంగ్రెస్-సీపీఐ పొత్తు.. డీల్ ఇదే!

ఇదంతా పక్కకి పెడితే అతిగా ఫోన్లు వాడడం వలన చాలా మంది నిద్రలేమి సమస్యతో బాదపతున్నట్లు వైద్యు నిపుణులు వెల్లడించారు. మనం ఆరోగ్యంగా ఉండడంలో నిద్ర అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. సాధారణంగా ఒక మనిషి 6 నుంచి 8 గంటలు నిద్రించాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే కొందరికి రాత్రుళ్లు కూడా సరిగా నిద్ర పట్టక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఇలా ప్రతిరోజూ సరైన సమయం నిద్రకు కేటాయించకపోతే.. నిద్రలేమి సమస్య పెరిగే అవకాశం ఉంది.

publive-image

అయితే రాత్రి పూట నిద్ర పట్టకపోవడానికి చాలా కారణలే ఉన్నాయి. ముఖ్యంగా మానసిక ఒత్తిడి అధికంగా ఉన్న వారికి నిద్రలేమి సమస్య అధికంగా వేదిస్తుంది. ఇక రాత్రుళ్లు టీ, కాఫీ, చాక్లెట్ వంటివి తీసుకున్న నిద్ర దురమౌతుంది. అందువల్ల రాత్రి భోజనం చేసిన తరువాత టీ, కాఫీ వంటి వాటికి దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. రాత్రిపూట నీరు ఎక్కువగా తాగిన.. నిద్రపై ప్రభావం పడుతుందట. అందువల్ల రాత్రి వీలైనంత తక్కువ నీరు తాగాలని నిపుణులు చెబుతున్నారు. ఇక చాలా మందికి రాత్రి భోజనం చేసిన తరువాత ఐస్ క్రీమ్ తినే అలవాటు ఉంటుంది. ఇలా ఐస్ క్రీమ్ తినడం వల్ల శరీరంలోని నరాలు ఉత్తేజానికి లోనై నిద్ర సరిగా రాదు. అలాగే రాత్రి నిద్రపోయే గంట ముందు సెల్ ఫోన్లను వాడకుండా దూరంగా పెట్టడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

                                          "ఆరోగ్యంగా ఉండాలంటే ఆరు గంటల నిద్ర ముఖ్యం"

ALSO READ: KA పాల్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నది వీరే!

Advertisment
Advertisment
తాజా కథనాలు