కావాలని బట్ట కాల్చి గవర్నర్ మీద వేస్తున్నారు..ఆర్టీసీ ఇష్యూ పై ఈటల రియాక్షన్ ఇదే!!

ఆర్టీసీ ఇష్యూపై అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రియాక్ట్ అవుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడాన్ని బీజేపీ పార్టీ స్వాగతిస్తోందన్నారు.ఆర్టీసీ విలీనం బీజేపీకి ఇష్టం లేదని ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. కావాలని బట్ట కాల్చి గవర్నర్ మీద బీఆర్ఎస్ వేస్తోందని ఫైర్..!!

New Update
కావాలని బట్ట కాల్చి గవర్నర్ మీద వేస్తున్నారు..ఆర్టీసీ ఇష్యూ పై ఈటల రియాక్షన్ ఇదే!!

Etela Rajender On TSRTC Issue: కొన్నాళ్ల పాటు కాస్త సర్దుమణిగిన రాజ్ భవన్(Raj Bhavan) వర్సెస్ ప్రగతి భవన్ (Pragathi Bhavan) వార్ మళ్లీ ఒక్కసారిగా ఆర్టీసీ ఇష్యూతో పీక్స్ కు వెళ్ళుతోంది. ఇప్పటి వరకు గవర్నర్ దే కాస్త సర్కార్ పై అప్పుడప్పుడు పై చెయ్యి అవుతూ వచ్చిన ఈ సారి మాత్రం ఆర్టీసీ బిల్లు విషయంలో తమిళి సై(Governor Tamilisai) కేసీఆర్ (KCR) గవర్నమెంట్ కు చిక్కారు. ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించిన సెన్సిటివ్ ఇష్యూ కావడంతో అలా గవర్నర్ బిల్లుకు నో అన్నారో లేదో.. ఇలా ఆర్టీసీ ఉద్యోగులు రోడ్డెక్కారు. ఎక్కడికక్కడా బస్సు చక్రాలకు బ్రేక్ వేశారు. నిరసనలంటూ ఆందోళనకు దిగుతున్నారు.

దీంతో ఇంత త్వరగా హీటెక్కిన ఈ మ్యాటర్  ఎక్కడిదాకా వెళుతుందో నన్న టెన్షన్ నెలకొంది. మరోవైపు రాజకీయంగా ఇప్పుడిప్పుడే ఓ గాడిలో పడుతున్న బీజేపీ (BJP) మెడకు చుట్టుకుంటోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం బీజేపీకి ఇష్టం లేదన్న కోణంలోకి మ్యాటర్ టర్న్ అవుతోంది. దీంతో ఆర్టీసీ ఇష్యూపై రియాక్ట్ అవుతూ  అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్  కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడాన్ని బీజేపీ పార్టీ స్వాగతిస్తోందన్నారు. ఆర్టీసీ విలీనం బీజేపీకి ఇష్టం లేదని ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. బీఆర్ఎస్  కావాలని బట్ట కాల్చి గవర్నర్ మీదవేస్తోందని ఫైర్ అయ్యారు.

ఈ విషయం తెలుసుకోకుండా ఆర్టీసీ ఉద్యోగులను తప్పుదోవ పట్టిస్తున్నారని, వారిని   బలవంతంగా రాజ్ భవన్ పంపిస్తున్నారని  మండిపడ్డారు ఈటల.   ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం రెండు పీఆర్సీలు బకాయి ఉందన్నారు. ముందు వాటిని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అయితే మంత్రి వర్గం ఆమోదం తెలిపిన ఆర్టీసీ బిల్లు గవర్నర్ టేబుల్ పై గత రెండ్రోజులుగా ఉంది. కాని ఆమె దానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. మరి ఈ రోజుతో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగుస్తున్నాయి. బహుశా ఇవే చివరి సమావేశాలు కావొచ్చు. దీంతో ఆర్టీసీ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలపకపోతే పరిస్థితి ఏంటనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.

అయితే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ సర్వీసులోకి తీసుకోవడానికి సంబంధించి ప్రభుత్వం పంపిన బిల్లును పరిశీలించాల్సిన అవసరం ఉందని.. అందుకు కొంత సమయం కావాలని గవర్నర్ కార్యాలయం స్పష్టం చేసింది. ఇక బిల్లును అసెంబ్లీలో పెట్టే ఉద్దేశం ఉండి, ప్రాధాన్యమైనది అయినప్పటికీ.. ప్రభుత్వం ప్రత్యేక ప్రతినిధి బృందం ద్వారా కాకుండా.. సాధారణ తరహాలో రాజ్ భవన్ కు పంపిందనే ఆరోపణలున్నాయి.

Also Read: బిగ్‌ ట్విస్ట్.. ఆర్టీసీ యూనియన్‌ నాయకులతో చర్చలకు గవర్నర్ పిలుపు

Advertisment
Advertisment
తాజా కథనాలు