Home Tips: కుండిలో దోసకాయను ఇలా పండించవచ్చు.. భలే చిట్కా!

దోసకాయలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. వేసవి కాలంలో దీనిని తీనటం వల్ల డీహైడ్రేషన్‌కు గురికారని నిపుణులు చెబుతున్నారు. కొందరికి ఇంట్లో దోసకాయ చెట్లను పెంచుకోవాలని ఉంటుంది. ఇంట్లోనే చిన్న చిట్కాలతో ఈ చెట్లను పెంచుకోవచ్చు. ఆ టిప్స్‌ తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్‌లోకి వెళ్లండి.

New Update
Home Tips: కుండిలో దోసకాయను ఇలా పండించవచ్చు.. భలే చిట్కా!

Cucumbers: ప్రతి ఒక్కరూ వేసవి కాలంలో దోసకాయ తినమని నిపుణులు సలహా ఇస్తారు. ఎందుకంటే ఇది నిర్జలీకరణం నుంచి రక్షించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుందని రుజువు అయ్యింది. అయితే.. కొన్నిసార్లు మార్కెట్‌లోని దోసకాయలు చెడ్డవిగా  ఉంటే మరి కొన్నిసార్లు ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది కాకుండా..వేడి కారణంగా.. దోసకాయ కొనడానికి మార్కెట్‌కు వెళ్లాలని అనిపించదు. ఆ టైంలో ఇంట్లో కుండిలో దోసకాయ చెట్లను పెంచుకునే పద్ధతిని ట్రై చేయవచ్చు. దోసకాయను తినడానికి ఇష్టపడితే.. దానిని ఇంట్లో సులభంగా పెచ్చుకునే పద్ధతి ఉంది. వాటి గురించి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

వేసవిలో దోసకాయ చెట్టు పెంచుకునే విధానం:

  •  దోసకాయలో చాలా ఎలక్ట్రోలైట్‌లు ఉన్నాయి. దీనివల్ల ఎప్పటికీ డీహైడ్రేషన్‌కు గురికారని నిపుణులు చెబుతున్నారు. వేసవి కాలంలో దోసకాయలను ఎక్కువగా తినడం మంచిది. దోసకాయలో ఉంటే ఫైబర్, విటమిన్లు ఇది కడుపు సంబంధిత సమస్యలు, ఆహారం జీర్ణం కావడానికి, చర్మ సమస్యలు, రక్తం గడ్డకట్టడాన్నినివారిస్తుంది.
  • ఇంట్లో దోసకాయను ఎలా పండించవచ్చు, దానిని కుండలో నాటడం ఏమిటి? దీని కోసం మీరు మార్కెట్ నుంచి మంచి నాణ్యమైన దోసకాయ విత్తనాలను కొనుగోలు చేయాలి. మీరు కూరగాయల విక్రేత నుంచి కూడా దీని గురించి సమాచారాన్ని పొందవచ్చు.
  • ముందుగా విత్తనాలు, కుండలు, మట్టి సిద్దం చేసుకోవాలి. దీని తరువాత.. దోసకాయ గింజలను తీసి, వాటిని ఒక గ్లాసు నీటిలో రెండు గంటలు నానబెట్టాలి. దీనివల్ల గింజల్లో తేమ పోతుంది. ఇప్పుడు అన్ని విత్తనాలను తడి టిష్యూ పేపర్, పేపర్ టవల్‌లో కట్టి సుమారు 10-12 గంటల పాటు ఉంచాలి. ఈ విత్తనాలను గాలి చొరబడని డబ్బాలో ఉంచాలి. దీనివల్ల విత్తనాలు మొలకెత్తుతాయి.
  •  గాలి చొరబడని కంటైనర్‌లో విత్తనాలను ఉంచేటప్పుడు.. టిష్యూ పేపర్‌ను ఎక్కువగా తడి చేయవద్దు, కంటైనర్‌ను నీటితో నింపవద్దని గుర్తుంచుకోవాలి. ఇందుకోసం టిష్యూ పేపర్‌పై కొంత నీరు చల్లాల్సి ఉంటుంది. విత్తనాలు 10-12 గంటల తర్వాత మొలకెత్తినప్పుడు.. వాటిని మట్టిలో నాటవచ్చు.
  • విత్తనాలు విత్తడానికి ముందు కుండను సిద్ధం చేయడం ముఖ్యం. ఇందుకోసం ఆవుపేడ ఎరువును మట్టిలో కలిపి కుండీలో నింపాలి. దీని తరువాత.. దోసకాయ గింజలను 2 నుంచి 3 అంగుళాల లోతులో నాటాలి. కుండను ఎక్కువ సూర్యకాంతి, ఎక్కువ నీడ లేని ప్రదేశంలో ఉంచాలి. కుండకు రోజుకు ఒకసారి నీరు పెట్టాలి.
  •  ఏడు రోజుల తర్వాత.. కుండీలో మొక్కల తీగ కనిపిస్తుంది. 15 రోజుల తరువాత.. మొక్క తీగపై పువ్వులు కనిపిస్తాయి. దీని తర్వాత పురుగుమందుల నుంచి మొక్కను రక్షించడం అవసరం. దీనికోసం.. ఆవు పేడను మట్టిలో కలిపి పిచికారీ చేయాలి, ఆకులపై పురుగుల మందు వేయాలి. ఇది దోసకాయలో కీటకాలు కనిపించకుండా చేస్తుంది. ఇప్పుడు రెండు మూడు నెలల్లో దోసకాయలు కాస్తాయి. దీని తరువాత.. దోసకాయ తీగకు చెక్క మద్దతు ఇవ్వాలి. దీంతో తీగ వంగదు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.

ఇది కూడా చదవండి: టిఫిన్‌లో ఈ నాన్‌వెజ్‌ను ట్రై చేయండి.. వెరైటీతో పాటు రుచి అద్భుతం!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TTDలో నిజంగానే 100 ఆవులు చనిపోయాయా?: చైర్మన్ బీఆర్ నాయుడు కీలక ప్రకటన!

TTD ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోశాలలో 100 ఆవులు చనిపోయాయన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని చైర్మన్ BR నాయుడు స్పష్టం చేశారు. భూమన కరుణాకర్ రెడ్డి కల్పిత ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఇతర ప్రాంతాల్లో చనిపోయిన గోవుల ఫోటోలను ఇక్కడివిగా చిత్రీకరిస్తున్నారన్నారు.

New Update
TTD Cows Death

TTD Chairman Reaction Over Cows Death

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని నిర్వహించబడుడున్న ఎస్వీ గోశాలలో దాదాపు 100 గోవులు మృతి చెందాయని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి నిన్న ఆరోపించిన విషయం తెలిసిందే. అత్యంత దయనీయ పరిస్థితుల్లో ఆ ఆవులు చనిపోతున్నాయని.. ఇది మహా అపచారం అని ఆవేదన వ్యక్తం చేశారు. మృతి చెందిన ఆవులకు సంబంధించిన ఫొటోలను సైతం కరుణాకర్ రెడ్డి విడుదల చేశారు. ఈ అంశంపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్పందించారు. కరుణాకర్ రెడ్డి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారన్నారు. ఇలాంటి కల్పిత ఆరోపణలు అత్యంత విషాదకరమన్నారు. శ్రీవారి సేవలో నిమగ్నమై, హిందూ ధర్మ పరిరక్షణకు అంకితభావంతో టీటీడీ ట్రస్ట్ బోర్డు చేపడుతున్న పుణ్య కార్యక్రమాల పట్ల కంటకింపుతో ఈ తరహా చర్యలకు దిగడం చాలా బాధాకరమనర్నారు.

గోమాతకు హిందూ ధర్మంలో ఉన్న ప్రాముఖ్యత అనన్య సాధారణమన్నారు. వేదకాలం నుంచే గోమాతను దేవతలతో పూజిస్తూ వస్తున్నామన్నారు. ఏ ఒక్క గోవు యొక్క మృతి కూడా సామాన్యంగా తీసుకోలేమన్నారు. కానీ సహజంగా తప్పని అనారోగ్యం, వృద్ధాప్యం, ప్రమాదాలు వంటి కారణాల వల్ల  గోవుల మృతి జరిగే అంశాన్ని రాజకీయంగ, అబద్ధ ప్రచారానికి వాడుకోవడం అత్యంత అధర్మమని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇతర ప్రాంతాల్లోని ఫొటోలను ఇక్కడివిగా..

ఇంకా దుర్మార్గంగా, ఇతర ప్రాంతాల్లో చనిపోయిన గోవుల ఫోటోలను టీటీడీ గోశాలకు చెందినవిగా  చిత్రీకరించి ప్రజలను మోసగించేందుకు చేస్తున్న కుట్ర బాధాకరమన్నారు. ఇలాంటి వదంతులను ప్రజలు గుర్తించి, అవాస్తవాలపై నమ్మకం కలిగి మోసపోవద్దని కోరారు. గోసేవా అంటేనే గోదేవి సేవ అని అన్నారు. ఈ పవిత్రమైన సేవను రాజకీయ లబ్ధి కోసం మచ్చలేసే ప్రయత్నాలను భక్తులందరూ తిరస్కరించాలన్నారు. శ్రీవారి ఆశీస్సులతో, హిందూ ధర్మ పరిరక్షణలో టీటీడీ చేపడుతున్న గోరక్షణ, గోపోషణ కార్యక్రమాలపై భక్తుల విశ్వాసం మరింత బలపడాలని ఆకాంక్షించారు. 

(br naidu ttd chairman | telugu-news | latest-telugu-news | telugu breaking news)

Advertisment
Advertisment
Advertisment