Couples of Quarrels: దంపతుల మధ్య గొడవలకు ప్రధాన కారణాలు ఇవే భార్యాభర్తల్లో కొన్ని మనస్పర్థలు వచ్చి చిన్నచిన్న గొడవలు అవుతాయి. చినికి చినికి గాలివానలా మారి చివరకు విడాకుల వరకు దారి తీస్తాయి. అలా జరగకుండా ఉండాలంటే ఇలా చేయండి. ఒకరు ఏదైనా మాట అంటే మౌనంగా ఉండండి. వాదించకుండా ఉంటే బెటర్ అని నిపుణులు సూచిస్తున్నారు. By Vijaya Nimma 04 Dec 2023 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి couples of Quarrels: పెళ్లి తర్వాత చాలా మంది భార్యాభర్తల్లో కొన్ని మనస్పర్థలు వస్తూ ఉంటాయి. కొన్ని కొన్ని చిన్న గొడవలు చిలికి చిలికి గాలివానలా మారుతాయి. చివరకు విడాకుల వరకు దారి తీస్తాయి. అయితే దంపతుల మధ్య గొడవలు రావడానికి ప్రధానంగా నాలుగు కారణాలు ఉంటాయని మానసిక నిపుణులు అంటున్నారు. వాటికి పరిష్కారాలు కూడా సూచిస్తున్నారు. ముందుగా ఒక గొడవ తలెత్తినప్పుడు ముందుగా దాన్ని ఎలా పరిష్కరించుకోవాలో మార్గాలు వెతుక్కోవాలని లేకపోతే అది పెద్దగా మారుతుందని, అంతేకాకుండా కొన్నిసమస్యలు కూడా తలెత్తుతాయని చెబుతున్నారు. ఎదుటివారిని అర్థం చేసుకోకపోవడమే.. సాధారణంగా ఏదైనా ఒక విషయంలో గొడవ అయితే ఒకరిపై ఒకరు మాటల దాడులు చేసుకోవడం సహజం. ఒకరు ఒక మాట అనగానే దాన్ని లైట్ తీసుకోకుండా మరో మాట అనడమే గొడవ పెరగానికి కారణం అని చెబుతున్నారు. అలా జరగకుండా ఉండాలంటే ఒకరు ఏదైనా మాట అంటే మౌనంగా ఉండాలని, అంతేకాకుండా వాదించకుండా ఉంటే బెటర్ అని నిపుణులు అంటున్నారు. ఇక చాలా గొడవలకు కారణం సరిగా ఎదుటివారిని అర్థం చేసుకోకపోవడమే అని చెబుతున్నాఆరు. భాగస్వామి ఏం ఆలోచిస్తున్నారో అర్థం చేసుకోవాలని, ఇలా ఇద్దరు ఎదుటివారు ఏం ఆలోచిస్తున్నారో మనం బేరీజు వేసుకోవాలని చెబుతున్నారు. ఇది కూడా చదవండి: టమోటాకు బదులు కూరల్లో ఇవి వాడుకోవచ్చు..టేస్ట్ ఏ మాత్రం తగ్గదు సాధారణంగా ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉండవు. అవి అర్థం చేసుకోకపోవడం వల్లే గొడవలు వస్తాయంటున్నారు. అందుకే ఎదుటివారు ఏం అంటున్నారో అర్థం చేసుకోవాలని అంటున్నారు. దంపతుల్లో ఒకరు తమ భాగస్వామిని పొరుగున ఉండేవారితో పోల్చకపోవడం మంచిది. ఎవరికి వారు ప్రత్యేకమే. అయితే ప్రతి ఒక్కరిలో ఒక్కో రకం లక్షణాలు ఉంటాయని గుర్తించాలి. అందుకే ఒకరితో పోల్చడం మానేయాలి. మరొకటి బ్లాక్ మెయిల్ చేయడం వల్ల కూడా సంబంధాలు చెడిపోతాయి. అది ప్రేమ అయినా ఎలాంటి బంధం అయినా బ్లాక్ మెయిల్ చేయడంతో రిలేషన్‌షిప్‌లో గొడవలు మొదలవుతాయని నిపుణులు అంటున్నారు. అందుకే బ్లాక్‌మెయిల్‌కు పాల్పడకుండా ప్రేమగా చూసుకుంటే మంచిది. ఇలాంటి విషయాలు గుర్తుంచుకుని జాగ్రత్తగా మసులుకుంటే ఎలాంటి గొడవలు లేకుండా రిలేషన్‌షిప్‌ను హ్యాపీగా మార్చుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. #couples #quarrels మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి