సంతనానలేమి సమస్యలతో బాధపడుతున్న మగవాళ్లు తీసుకోవల్సిన ఫుడ్స్ ఇవే! మగవారిలో వీర్య కణాల సంఖ్య తగ్గిపోవడం వల్ల ఇన్‌ఫెర్టిలిటీ సమస్య పెరుగుతుంది.అయితే ఫెర్టిలిటీని పెంచేందుకు యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే ఆహారం తీసుకోవాలి.దీంతో సంతానలేమి సమస్యలకు ఇట్టే చెక్ పెట్టేయండి! By Durga Rao 08 Jun 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి నేటి తరంలో చాలామంది మగవాళ్లు సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారు. గత పదేళ్లలో ఈ సమస్య మరింత పెరిగినట్టు పలు అధ్యయనాలు చెప్తున్నాయి. అసలీ సమస్య ఎందుకొస్తుంది? దీనికి చెక్ పెట్టేదెలా? మగవారిలో వీర్య కణాల సంఖ్య తగ్గిపోవడం వల్ల ఇన్‌ఫెర్టిలిటీ సమస్య పెరుగుతుంది. దీనికి చాలా కారణాలుండొచ్చు. జన్యు పరమైన కారణాలతోపాటు హార్మోనల్ ఇంబాలెన్స్, యాంటీ-స్పెర్మ్ యాంటీబాడీస్, కొన్నిరకాల ఇన్ఫెక్షన్ల వంటి కారణాలు కూడా ఉంటాయి. వీటితోపాటు స్మోకింగ్, డ్రింకింగ్, ఇతర ఆహారపు అలవాట్లు కూడా స్పెర్మ్ కౌంట్‌ను తగ్గిస్తాయి. అయితే లైఫ్‌స్టైల్ హ్యాబిట్స్ వల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గినవాళ్లు కొన్ని ఫుడ్స్‌తో దాన్ని సరిచేయొచ్చు. ఫెర్టిలిటీని పెంచేందుకు యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే ఆహారం తీసుకోవాలి. అలాగే విటమిన్లు, మినరల్స్ బ్యాలెన్స్‌డ్‌గా ఉండేలా సమతుల ఆహారం తీసుకోవాలి. ఇన్‌ఫెర్టిలిటీ సమస్య ఉన్నవాళ్లు కాయగూరలు ఎక్కువగా తినాలి. క్యాబేజీ, క్యారెట్, పాలకూర, మునగాకు వంటి వాటిలో ఏ, సీ,ఈ, కె విటమిన్లతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఆకుకూరల్లో ఉండే ఫోలేట్(విటమిన్ బీ9) వీర్యకణాల్లో డీఎన్‌ఏ వృద్ధి చెందడానికి తోడ్పడుతుంది. స్పెర్మ్ కౌంట్ పెరిగేందుకు హెల్దీ ఫ్యాట్స్ కూడా ముఖ్యమే. దీనికోసం నెయ్యి, బటర్, పాలు వంటివి తీసుకోవచ్చు. అలాగే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కోసం చేపలు, నట్స్ వంటివి కూడా తీసుకోవాలి. వీటిలో ఉండే జింక్.. టెస్టోస్టిరోన్ హార్మోన్‌ను పెంచేందుకు తోడ్పడుతుంది. ఇక వీటితోపాటు హై క్యాలరీలు, షుగర్ ఉండే కార్బో్హైడ్రేట్స్‌కు బదులు కాంప్లెక్స్ కార్బ్స్ ఉండేలా బ్రౌన్ రైస్, మిల్లెట్స్ వంటివి తీసుకుంటే ఫెర్టిలిటీ సమస్య మరింత త్వరగా తగ్గుతుంది. అలాగే ఇన్‌ఫెర్టిలిటీ సమస్య ఉన్నవారు స్మోకింగ్, డ్రింకింగ్‌కు దూరంగా ఉండాలి. ఇన్‌ఫెర్టిలిటీ సమస్యకు ఇతర కారణాలు ఉన్నట్టు గుర్తిస్తే డాక్టర్ సలహా మేరకు ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది. #foods మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి