తైవాన్ పార్లమెంట్‌లో తీవ్ర గందరగోళం..ఒకరినొకరు కొట్టుకున్న ఎంపీలు!

ఏ దేశంలోనైనా పార్లమెంటు సభలు నిర్వహించినప్పుడు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవటం సర్వసాధరణంగా మారింది.కానీ అదికాస్త మితిమీరి దాడుల వరకు వెళితే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు.అలాంటి సంఘటన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.అది ఎక్కడంటే..

New Update

తైవాన్ పార్లమెంట్‌లో జరిగిన సంఘటన చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. శుక్రవారం తైవానా పార్లమెంట్ లో పెద్ద ఎత్తున గందరగోళం నెలకొంది. అక్కడి డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (DPP), కోమింటాంగ్ (KMT) పార్టీల మధ్య వాడీవేడిగా సాగుతున్న చర్చలో ఎంపీలు ఒకరినొకరు కొట్టుకోవడం, తోసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

A member of Taiwan's parliament stole a bill and ran off with it to prevent it from being passed.
byu/DavidRolands ininterestingasfuck

ఎంపీలు ఫైళ్లను లాక్కొని పార్లమెంటు నుంచి బయటకు పరుగులు తీస్తున్నట్లు సోషల్‌మీడియాలోని ఓ వీడియోలో ఎంపీలు పెద్ద దుమారమే రేగింది. మరొక వీడియోలో, స్పీకర్ సీటు చుట్టూ కొంతమంది ఎంపీలు ఉన్నారు. వీడియోలో, చాలా మంది ఎంపీలు టేబుల్‌పైకి దూకడం, మరికొందరు తమ సహోద్యోగులను నేలపైకి లాగడం లాంటి దృశ్యాలు కనిపించాయి.

శాసనసభలో మెజారిటీ లేకుండా కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు లై చింగ్-తే సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించడానికి కొద్ది రోజుల ముందు పార్లమెంటులో ఈ గొడవ జరిగింది. అల్ జజీరా చేసిన వీడియోలో ఒక ఎంపీ ఇతరులతో అతుక్కుని పడిపోవడం చూపిస్తుంది. పార్లమెంట్‌లో తప్పుడు ప్రకటనలు చేసే అధికారులను నేరంగా పరిగణించే కొత్త చట్టంపై డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (DPP), కోమింటాంగ్ (KMT) మధ్య వాగ్వాదం జరిగినట్లు సమాచారం.

Advertisment
Advertisment
తాజా కథనాలు