Home Affairs: డ్రగ్స్‌పై ఉక్కుపాదం.. హోం శాఖకు బడ్జెట్‌లో రూ.9,564 కోట్లు

TG: యువశక్తిని నిర్వీర్యం చేస్తున్న మాదకద్రవ్యాల కట్టడి, శాంతి భద్రతల కోసం హోం శాఖకు బడ్జెట్‌లో రూ.9,564 కోట్లను కేటాయించినట్లు చెప్పారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తెలంగాణను మాదకద్రవ్య రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.

New Update
పర్యాటక, సాంస్కృతిక అధికారులతో భట్టి మీటింగ్-LIVE

Home Affairs: యువశక్తిని నిర్వీర్యం చేస్తున్న మాదకద్రవ్యాల కట్టడి, శాంతి భద్రతల కోసం హోం శాఖకు బడ్జెట్‌లో రూ.9,564 కోట్లు కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. మాదక ద్రవ్యాల వినియోగం చాలా ప్రమాదకరం అన్నారు డిప్యూటీ సీఎం భట్టి. యువత దీని బారినపడితే దేశ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారుతుందని అన్నారు. రాష్ట్ర ప్రజలను, ముఖ్యంగా విద్యార్థులను ఈ మహమ్మారి బారి నుంచి కాపాడేందుకు వివిధ చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.

డ్రగ్స్‌ రవాణా, వినియోగం చేస్తూ పట్టుబడితే వారిని ఉపేక్షించొద్దని అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చినట్లు భట్టి తెలిపారు. తెలంగాణ మాదకద్రవ్య నిరోధక సంస్థకు తగిన సౌకర్యాలు కల్పించి దాన్ని బలోపేతం చేసినట్లు వెల్లడించారు. విద్యాసంస్థల్లో వీటి కట్టడికి యాంటీ డ్రగ్‌ కమిటీలు ఏర్పాటు చేసి.. 4,137 మంది విద్యార్థులను యాంటీ డ్రగ్‌ సోల్జర్స్‌గా నియమించినట్లు తెలిపారు. మాదకద్రవ్యాల వల్ల జరిగే హానిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సినీ ప్రముఖుల సహకారం తీసుకుంటున్నట్లు చెప్పారు. వీటికి సంబంధించిన కేసుల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తాం అని అన్నారు. తెలంగాణను మాదకద్రవ్య రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇస్తున్నాం అని అన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు