ఆమెకు 47..అతనికి 76 ..ఎనిమిదేళ్లు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు..!

ఘటన ఒడిశాలోని గంజాం జిల్లా శంఖేముండి మండలం అడ్డాడ గ్రామంలో రామచంద్ర సాహు (76) అనే వృద్ధుడికి పెళ్లైంది. ఇద్దరు కూతుళ్లకు పెళ్లి కూడా చేశాడు. భార్య మరణించింది. 18 ఏళ్ల నుంచి ఒంటరిగా జీవిస్తున్నాడు. ఈ క్రమంలో మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. నిమిదేళ్ల క్రితం భంజ్‌నగర్‌ కులాగర్‌ గ్రామానికి చెందిన త్రినాథ్‌ సాహు కుమార్తె సురేఖ (46) ను ఒకసారి చూశాడు. తొలిచూపులోనే ఆమెను పెళ్లి చేసుకోవాలకున్నాడు. జులై 19న భంజ్‌నగర్‌ కోర్టులో రామచంద్ర, సురేఖ వివాహం చేసుకున్నారు. ఈ ఎనిమిదేళ్లు ఫోన్లలోనే ప్రేమకథ నడిచింది.

New Update
ఆమెకు 47..అతనికి 76 ..ఎనిమిదేళ్లు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు..!

ఇద్దరి కూతుళ్లకు పెళ్లి చేసాడు. భార్య మరణించింది.తనతో ఇప్పుడు ఎవరూ లేరు,తనకోసం ఎవరూ రారు.18 యేండ్లు క్షణమొక యుగంలా గడిచిపోయింది. ఇప్పుడు ఆ పెద్దాయనకు 76 యేండ్లు. ఒంటరి జీవితం..ఏకా మరణం నడునంతా నాటకం. ఇంతేనా జీవితం అనుకున్నాడు.!

publive-image

ఆయువుంది,ప్రాణముంది,నెత్తురుంది సత్తువుంది. సెకెండ్ ఇన్నింగ్స్ ఇంత సీరియస్ గా ఉండకూడదు అనుకున్నారు.కాడు రమ్మనే దాకా కావలసిని సమయం ఉందనుకున్నాడు. ఖాళీగా ఉండడం ఎందుకనుకున్నాడు.

అప్పుడే సురేఖ అతని కంటపడింది.పడిపోయాడు. కాళ్లుతన్నుకుని కాదండోయ్! ప్రేమతన్నుకొచ్చి తొలిచూపులోనే పడిపోయాడు. ఎనిమిదేళ్లు ఆమెను పిచ్చిగా ప్రేమించాడు. ఆమె కోసం కలలు కన్నాడు. పెంళ్లంటూ చేసుకుంటే ఆమెనే చేసుకోవాలనుకున్నాడు.

చివరకు సాధించాడు. ఆమె పెద్దలతో మాట్లాడి అర్హత సాధించాడు. ఇంతకీ ఆమె వయసు చెప్పలేదు కదూ జస్ట్ 47 యేండ్లంతే..! ఎనిమిదేళ్ల ప్రేమకు ఇప్పుడు శుభం కార్డు పడింది.శుభలేఖగా మారింది. ఇప్పుడు వాళ్లు దంపతులు..

యువకులకు ఏమాంత్రం తీసిపోని దంపతులు. మిగిలిన జీవితాన్ని ఒకరికొకరుగా పండించుకునేందుకు తోడూనీడగా నిలచే దంపతులు. ఇప్పుడీ ఈ జంట నెట్టింట ట్రెండ్ వైరల్ అయ్యింది.

ఈ వింత వెడ్డింగ్ ఘటన ఒడిశాలోని గంజాం జిల్లా శంఖేముండి మండలం అడ్డాడ గ్రామంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం...గ్రామానికి చెందిన రామచంద్ర సాహు (76) అనే వృద్ధుడికి చాలా ఏళ్ల క్రితం వివాహమైంది.

తన ఇద్దరు కూతుళ్లకు పెళ్లి కూడా చేశాడు. ఈ క్రమంలో భార్య మరణించింది. దీంతో దాదాపు 18 ఏళ్ల నుంచి ఒంటరిగా జీవిస్తున్నాడు. ఈ క్రమంలో మళ్లీ పెళ్లి చేసుకోవాలని కోరిక కలిగింది. అయితే.. దాని కోసం ప్రయత్నాలు మొదులుపెట్టిన క్రమంలో.. ఎనిమిదేళ్ల క్రితం భంజ్‌నగర్‌ కులాగర్‌ గ్రామానికి చెందిన త్రినాథ్‌ సాహు కుమార్తె సురేఖ (46) ను ఒకసారి చూశాడు.

అయితే, అలా చూసిన తొలిచూపులోనే ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ప్రేమలో పడ్డానని.. పెళ్లిచేసుకుంటానని రామచంద్ర చెప్పిన మాటలకు సురేఖ కూడా అంగీకరించింది. కొన్నాళ్లు ఇద్దరూ ఫోన్‌లో మాట్లాడుకుంటూ కాలం వెళ్లదీశారు.

చివరకు జులై 19న భంజ్‌నగర్‌ కోర్టులో రామచంద్ర, సురేఖ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఆలయంలో ఆచారాల ప్రకారం మళ్లీ పెళ్లి చేసుకున్నారు. ఈ వయసులో తమ ప్రేమ పెళ్లిని అడ్డుకోకుండా.. కుటుంబ సభ్యులు పెద్ద మనసుతో ఆలోచించాలని ఇద్దరూ పేర్కొన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు