కిచిడీ కోసం జుట్లు పట్టుకొని కొట్టుకున్న టీచర్,వంట మనిషి.. వీడియో వైరల్!!

టీచర్ ఇంకా వంట మనిషి ఇద్దరు సిగలు పట్టుకొని కుస్తీకి దిగారు. నువ్వా..నేనా అన్నట్టుగా అందరి ముందే బాహాబాహీకి దిగారు. పొట్టు పొట్టు కొట్టుకున్నారు.ఇక ఇంతలా టీచర్ ఇంకా వంట మనిషి కొట్టుకోవడానికి కారణం తెలిస్తే.. ముక్కున వేలు వేసుకోకుండా ఉండలేం. వీరి మధ్య కయ్యానికి కారణం కిచిడీ.

New Update
కిచిడీ కోసం జుట్లు పట్టుకొని కొట్టుకున్న టీచర్,వంట మనిషి.. వీడియో వైరల్!!

మహారాష్ట్రలోని ఓ ప్రాథమిక పాఠశాలలో టీచర్ ఇంకా వంట మనిషి ఇద్దరు సిగలు పట్టుకొని కుస్తీకి దిగారు. నువ్వా..నేనా అన్నట్టుగా అందరి ముందే బాహాబాహీకి దిగారు. పొట్టు పొట్టు కొట్టుకున్నారు. వాళ్లను విడిపించడానికి అక్కడున్న వాళ్లు ప్రయత్నించినా.. ప్రయోజనం లేకుండా పోవడంతో చాలా సేపు వరకు ఒకరి జట్టు మరొకరి చేతుల్లోనే ఉంది. చివరికి ఓ టీచర్ ధైర్యం చేసి.. మధ్యలోకి వెళ్లి వాళ్లను విడిపించడంతో ఈ డబ్ల్యూడబ్ల్యూ ఫైట్ కు తెర పడింది.

అయితే కొట్టుకుంటూ ఒకర్ని ఒకరు బూతులు తిట్టుకోవడంతో స్కూల్ లోని విద్యార్థులు సైతం నోళ్ళు తెరిచారు. ఇక ఇంతకీ..ఇంతలా టీచర్ ఇంకా వంట మనిషి కొట్టుకోవడానికి కారణం తెలిస్తే.. ముక్కున వేలు వేసుకోకుండా ఉండలేం. వీరి మధ్య కయ్యానికి కారణం కిచిడీ. పిల్లల కోసం మధ్యాహ్నం భోజనం పథకంలో భాగంగా వంట మనిషి వండిన కిచిడీ బాలేదని టీచర్ అరిచింది. అలాగే స్కూల్ ఆవరణలో వంట మనిషి భర్త షాప్ ఎందుకు పెట్టాడని ప్రశ్నించింది. దీంతో కోపంతో రగిలిపోయిన వంట మనిషి టీచర్ తో నీకెందుకని గొడవకు దిగింది.

అది కాస్త చినికి చినికి గాలి వానలా మారి.. ఇద్దరు ఒకరి జుట్టు ఒకరు పట్టుకునే వరకు పోయింది. ఇది గమనించిన మిగతా టీచర్లు, స్టాఫ్ వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ తగ్గేదేలే.. అన్నట్టుగా వారిద్దరు పొట్టు పొట్టు కొట్టుకున్నారు. ఈ ఫైట్ ను అంతా చక్కగా వీడియో తీసిన ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్త ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు