Trains Cancelled: మూడు రోజుల పాటు ఆ స్పెషల్‌ రైళ్లు రద్దు!

స్వాతంత్య్ర దినోత్సవంతో పాటు వీకెండ్‌ సెలవులను దృష్టిలో పెట్టుకుని సౌత్‌ సెంట్రల్‌ రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే వాటిని మూడు రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. సాంకేతిక సమస్యల వల్ల ఈ రైళ్లను రద్దు చేస్తున్నట్లు వివరించారు.

New Update
Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు అలర్ట్‌..జులై 29 నుంచి 31 వరకు 62 రైళ్లు రద్దు..!

Trains Cancelled: గత కొంతకాలంగా రైల్వేశాఖకు సంబంధించిన కొన్ని వార్తలు భయాందోళను గురి చేస్తున్నాయి. ఈ మధ్య కాలంలో రైల్వే ప్రమాదాలు, రైళ్ల రద్దు వంటి వార్తలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ట్రాక్ మరమ్మతులు, రైల్వే స్టేషన్ల నిర్మాణాల కారణంగా ఆయా ప్రాంతాల నుంచి వెళ్లే రైళ్లను దారి మళ్లించడంతోపాటు కొన్ని రైళ్లను రద్దు చేస్తూ రైల్వే శాఖ ఎప్పటికప్పుడు ముఖ్యమైన అప్‌డేట్‌లను ఇస్తుంది.

ఈ క్రమంలో పలు ప్రత్యేక రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తాజాగా ప్రయాణికులకు ఒక ముఖ్యమైన అప్‌డేట్‌ను విడుదల చేసింది. తాజాగా దక్షిణ మధ్య రైల్వే శాఖ మూడు రోజుల పాటు పలు మార్గాల్లో నడిచే ప్రత్యేక రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కాగా, ఈరోజు నుంచి అంటే ఆగస్టు 17 నుంచి 19 వరకు తిరుపతి-కాచిగూడ, కాకినాడ టౌన్-సికింద్రాబాద్- -కాకినాడ టౌన్, నర్సాపూర్- -సికింద్రాబాద్- -నర్సాపూర్ రైళ్లు అందుబాటులో ఉండవని రైల్వే శాఖ పేర్కొంది.

సాంకేతిక సమస్యల కారణంగా ఈ రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. లేదంటే ఈ నెల 17 నుంచి 20వ తేదీ వరకు స్వాతంత్య్ర దినోత్సవ ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి రావాల్సి ఉంది.

Also Read: వైసీపీ బిగ్ షాక్.. మాజీ మంత్రి రాజీనామా!

Advertisment
Advertisment
తాజా కథనాలు