ఆరు గ్యారెంటీల అప్లికేషన్ ఫామ్ ఉర్దూలో ఉండాల్సిందే.. రేవంత్ సర్కార్ కు అసదుద్దీన్ డిమాండ్!

కాంగ్రెస్ ప్రభుత్వం అందిచబోయే ఆరు గ్యారంటీల ఫారమ్ ను ఉర్దూలోనూ ముంద్రించి తమ ప్రజలకు అందించాలని డిమాండ్ చేస్తున్నారు ఎంఐఎం నాయకుడు అసదుద్దీన్ ఓవైసీ. ఉర్దూ రాష్ట్ర రెండవ అధికారిక భాష కావున తప్పకుండా అందుబాటులో ఉండేలా చూస్తారని తెలంగాణ సీఎంఓను కోరారు.

New Update
ఆరు గ్యారెంటీల అప్లికేషన్ ఫామ్ ఉర్దూలో ఉండాల్సిందే.. రేవంత్ సర్కార్ కు అసదుద్దీన్ డిమాండ్!

Six guarantees: ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అందించబోయే ఆరు గ్యారంటీలపైనే చర్చ జరుగుతోంది. అధికారం చేపట్టగానే రెండు గ్యారంటీలను అమలు చేసిన రేవంత్ సర్కార్ మరో నాలుగు హామీలను నెరవేర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఇందులో భాగంగానే లబ్ది దారులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటోంది. అయితే ఆరు గ్యారెంటీలకు సంబంధించిన ధరఖాస్తులను డిసెంబర్ 28 నుంచి స్వీకరిస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించగా తాజాగా దీనిపై ఎంఐఎం పార్టీ నాయకుడు అసదుద్దీన్ ఓవైసీ (Asaduddin Owaisi) ఓ కొత్త డిమాండ్ తెరపైకి తెచ్చారు.

ఈ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం అందిచబోయే ఆరు గ్యారంటీల ఫారమ్ ను ఉర్దూలోనూ ముంద్రించి తమ ప్రజలకు అందించాలని కోరుతూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు అసదుద్దీన్. '#PrajaPalana ఫారమ్ ఉర్దూలో కూడా ఉండాలి. ఉర్దూ రాష్ట్ర రెండవ అధికారిక భాష కావున తప్పకుండా అందుబాటులో ఉండేలా చూస్తారని @తెలంగాణ సీఎంఓను కోరుతున్నాం. వీలైనంత త్వరగా అవసరమైన వారికి వీటిని అందుబాటులోకి తెస్తారని ఆశిస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోని.. ఈ పథకాల ప్రయోజనాలను పొందాలని నేను అభ్యర్థిస్తున్నాను. AIMIM ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, ఎమ్మెల్సీలు.. ఇందుకు సంబంధించి సమన్వయం, సహాయం చేయడానికి అందుబాటులో ఉంటారు' అంటూ ట్విట్టర్ వేదికగా చెప్పుకొచ్చారు. అలాగే ఇందులో కాంగ్రెస్ ఫారమ్ తో కూడిన ఇమేజ్ షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా ముస్లిం సోదరులు దీనిపై పాటిటివ్ గా స్పందింస్తున్నారు.

ఇది కూడా చదవండి : ‘దేవర’.. రిలీజ్ కు ముందే భారీ ధరకు కొనేసిన ఓటీటీ ప్లాట్ ఫామ్!

Advertisment
Advertisment
తాజా కథనాలు