Sex scandal: 2011లో ఎన్డీ తివారీ.. ఇప్పుడు మరో గవర్నర్.. సెక్స్ కుంభకోణం అసలు కథేంటి!?

దేశంలో లోక్ సభ ఎన్నికల వేళ సెక్స్ కుంభకోణం ఇష్యూ సంచలనంగా మారింది. ఉన్నత హోదాలో వున్న వ్యక్తులే అతిశృంగార కోరికలకు లోనవుతున్నారా? లేదా వక్రబుద్ధితో మహిళలే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారా? ఇంట్రెస్టింగ్ స్టోరీ కోసం ఆర్టికల్ లోకి వెళ్లండి.

New Update
Sex scandal: 2011లో ఎన్డీ తివారీ.. ఇప్పుడు మరో గవర్నర్.. సెక్స్ కుంభకోణం అసలు కథేంటి!?

Sex scandal: దేశంలో ప్రముఖుల సెక్స్ కుంభకోణం ఇష్యూ సంచలనం రేపుతోంది. ముఖ్యంగా ఉన్నత హోదా కలిగిన గవర్నర్ స్థాయి వ్యక్తులే సెక్స్ స్కాండల్ లో ప్రధాన నిందితులుగా ఆరోపణలు ఎదుర్కోవడం ఆందోళన కలిగించే అంశం. అయితే వెస్ట్ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్.. ప్రస్తుతం లైగింక ఆరోపణలు ఎదుర్కొంటుండగా.. 2011లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా పనిచేసిన ఎన్డీ తివారీకి సంబంధించిన అంశంకూడా మరోసారి తెరపైకి వచ్చింది. అయితే భారతదేశంలోని రాజకీయనాయకులు నిజంగానే అతిశృంగార కోరికలకు లోనవుతున్నారా? లేదా వక్రబుద్ధితో మహిళలే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారా? అనే ప్రశ్నలు జనాలను కలవరానికి గురిచేస్తున్నాయి.

ముగ్గురు స్త్రీలతో నగ్నంగా..
ఈ మేరకు కాంగ్రెస్ సీనియర్ నేత ఎన్డీ తివారీ 2011లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు గవర్నర్ గా పనిచేస్తున్న క్రమంలో లైంగిక వాంఛ తీర్చుకునేందుకు రాజ్ భవన్ లో పనిచేసే మహిళలను లొంగ దీసుకున్నట్లు ఆరోపనలు ఎదుర్కొన్నారు. అంతేకాదు 86 ఏళ్ల వయసున్న తివారీ.. ముగ్గురు స్త్రీలతో నగ్నంగా మంచంపై సరసలాడుతున్నట్లు 2009లో ఒక తెలుగు ఛానెల్ వీడియోను బయటపెట్టడం పెద్ద దుమారమే రేపింది. తివారీ ఏకంగా పవిత్రమైన రాజ్‌భవన్‌నే సెక్స్ కార్యాలయంగా మార్చివేశారని పలు మహిళా సంఘాలు ఆయనపై విరుచుకపడ్డాయి. ఆయనపై తక్షణం క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశాయి. వెంటనే తివారీ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ పదవికి రాజీనామా చేయాలంటూ ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు, ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టడంతో తివారి తన పదవికి రాజీనామా చేశారు. అయినప్పటికీ ఈ ఇష్యూ కోర్టు మెట్లు ఎక్కడంతో ప్రయోజన వ్యాజ్యం (పిల్) తర్వాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విజువల్స్ ప్రసారాన్ని నిలిపివేయాలని ఛానెల్‌ని కోరింది. గవర్నర్ ప్రతిష్టను దిగజార్చేందుకు ఉద్దేశించిన టీవీ కార్యక్రమం 'కల్పితమైన, తప్పుడు దురుద్దేశపూరితమైనదిగా రాజ్ భవన్ పేర్కొంది.

ఇది కూడా చదవండి: Watch Video : స్కూల్‌కు ఆలస్యంగా వచ్చిన టీచర్‌.. ప్రిన్సిపాల్ దాడి

ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్లనే..
అలాగే ముగ్గురు యువతులతో శృంగారం జరిపినట్లు ఓ తెలుగు ఛానల్ ప్రదర్శించిన దృశ్యాలన్నీ ఒట్టి అభూత కల్పనలని మాజీ గవర్నర్ ఎన్డీ తివారీ కొట్టి పారేశారు. మరెందుకు రాజీనామా చేశారన్న ప్రశ్నకు సమాధానమిస్తూ... తన ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్లనే తాను రాజీనామా చేశానని చెప్పుకొచ్చారు. తన ఆరోగ్యం బాగుపడిన తర్వాత తిరిగి క్రియాశీలక రాజకీయాల్లో పాలుపంచుకుంటానని తివారీ చెప్పారు. ఆ తర్వాత ఎన్డీ తివారీ సెక్స్ కుంభకోణం ఆసక్తికరమైన మలుపు తిరిగింది. సెక్స్ టేప్ లో ఉన్న మహిళలను రాజభవన్ లోకి ప్రవేశపెట్టడంలో తివారీ ఓఎస్డీ ఆర్యేంద్ర శర్మ పాత్ర ఉన్నట్లు అరోపణలు వచ్చాయి. శర్మ ఆ మహిళలను రాజభవన్ లోకి ప్రవేశపెట్టడంలో ప్రత్యేకంగా వ్యవహరించారని ఆంధ్రప్రదేశ్ రాజభవన్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మొహమ్మద్ షోకత్ అలీ చెప్పినట్లు ఒక ఆంగ్ల దినపత్రిక రాసుకురావడం దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది.

ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌ల మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రిగా పనిచేసిన తివారీ మహిళలకు సంబంధించిన వివాదాల్లో చిక్కుకోవడం అదే మొదటిసారి కాదు. కొంతకాలం క్రితం తివారీ కాంగ్రెస్ నాయకుడు, అతని తల్లి ఉజ్వల శర్మల మధ్య ఉన్న సన్నిహిత సంబంధం నుంచి పుట్టాడని పేర్కొంటూ రోహిత్ శేఖర్ అనే న్యాయవాది ఢిల్లీ హైకోర్టులో పితృత్వ దావా వేయడం విశేషం.

వెస్ట్ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ ..
ఇక తివారి కథ అలా ఉంటే.. తాజాగా వెస్ట్ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ తనను లైగింకంగా వేధించారంటూ ఓ ఉద్యోగి కోల్‌కతాలోని హేర్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఉద్యోగం పేరిట ఆనంద బోస్ తనను లైంగికంగా వేధించారంటూ రిపోర్ట్ లో తెలిపింది. అయితే తన మీద వచ్చిన ఆరోపణలు నిజం కాదని అంటున్నారు గవర్నర్ సీవీ ఆనంద్. ఇద్దరు ఉద్యోగులు కొన్ని రాజకీయ పార్టీలకు ఏజెంట్లుగా మారి అబద్దాలను ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఎవరో సృష్టించిన కథనాలకు తాను భయపడనని.. నిజమే ఎప్పటికైనా గెలుస్తుందన్నారు. దీనివల్ల ఎవరైనా రాజకీయ ప్రయోజనం పొందాలనుకుంటే అది వారి ఇష్టమని, బెంగాల్‌లో అవినీతి, హింసకు వ్యతిరేకంగా నా పోరాటాన్ని వారు నిలువరించలేరన్నారు. 'ఇద్దరు అసంతృప్త ఉద్యోగులు కొన్ని రాజకీయ పార్టీలకు ఏజెంట్లుగా మారి అసత్య కథనాలు ప్రచారం చేశారు. నిజం గెలుస్తుంది. సృష్టించిన కథనాలకు నేను భయపడను. ఎవరైనా నన్ను కించపరిచి ఎన్నికల ప్రయోజనాలు పొందాలనుకుంటే.. వారిని దేవుడే చూసుకుంటాడు. కానీ బెంగాల్‌లో అవినీతి, హింసకు వ్యతిరేకంగా నా పోరాటాన్ని వారు నిలువరించలేరు’’ అని రాజ్‌భవన్ కార్యాలయం ఎక్స్ (ట్విటర్) వేదికగా స్పందించింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు