Viral Video: భోజనాల్లో రసగుల్ల అయిపోయిందనుకుని... గుల్లగుల్లగా కొట్టుకున్నారు కదారా! అలీగఢ్ లోని సాస్నిగేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంట్లో పెళ్లి వేడుక జరుగుతుంది. ఆ సమయంలో ఎవరో పెళ్లి భోజనంలో రసగుల్లా అయిపోయిందని ఎవరో చెప్పారు.దీంతో ఒకరితో ఒకరు గొడవ పడటం ప్రారంభించారు. అది కాస్త తీవ్ర ఘర్షణకు దారి తీసింది. By Bhavana 14 Feb 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Marriege: ప్రతి ఒక్కరి జీవితంలో మరపురాని క్షణాలలో పెళ్లి ఒకటి. ఈ క్షణాన్ని ప్రత్యేకంగా మార్చడానికి చాలా మంది ఎన్నో ఏర్పాట్లు చేసుకుంటారు. ప్రతి చిన్న పనిని కూడా ఫోటోల రూపంలో భద్రపరచుకుంటారు. ఇల్లంతా ఎంతో అందంగా ముస్తాబు చేసుకుంటారు. ఊరంతా సంబరంగా చెప్పుకుంటారు. అతిథులను చాలా బాగా చూసుకుంటారు. వారికి రుచికరమైన ఆహారాన్ని అందిస్తుంటారు. అలీగఢ్ లో జరిగిన ఓ పెళ్లిలో ఓ వంటకం ప్రజల మధ్య తీవ్ర ఘర్షణకు దారి తీసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు పెళ్లికి వచ్చిన అతిథులు ఎందుకు కొట్టుకున్నారంటే.. అలీగఢ్ లోని సాస్నిగేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంట్లో పెళ్లి వేడుక జరుగుతుంది. ఆ సమయంలో ఎవరో పెళ్లి భోజనంలో రసగుల్లా అయిపోయిందని ఎవరో చెప్పారు. దీంతో పందిట్లో రసగుల్లా గురించి గుసగుసలు మొదలయ్యాయి. ఆ గుసగుసలు కాస్తా గుస్సాగుస్సాగా మారాయి. దీంతో ఒకరితో ఒకరు గొడవ పడటం ప్రారంభించారు. అది కాస్త తీవ్ర ఘర్షణకు దారి తీసింది. ఒక్కసారిగా కుర్చీలు పెట్టి మరీ కొట్టుకునే స్థాయికి వెళ్లిపోయారు. కుర్చీలతో దాడి చేసుకుంటున్న విజువల్స్ వీడియోలో చూడొచ్చు. కేవలం మగవారే మాట పట్టింపు కోసం కొట్టుకున్నారు అనుకోవచ్చు. మేమేం తక్కువ తిన్నాం అంటూ మహిళలు కూడా ఈ గొడవకి ఆజ్యం పోసి తెగ తన్నుకున్నారు. రసగుల్లా విషయంలో ఓ పెళ్లిలో వ్యక్తుల మధ్య గొడవ జరగడం ఇదే తొలిసారి కాదు. కొంతకాలం క్రితం, ఆగ్రాలో జరిగిన ఓ వివాహానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఆ సమయంలో కూడా రసగుల్లాపై గొడవ జరిగింది. వాగ్వాదం తీవ్రస్థాయికి చేరి ఒకరినొకరు కొట్టుకోవడం ప్రారంభించారు. ఈ పోరాటంలో దాదాపు అరడజను మంది గాయపడ్డారు. Also read: దర్శకుని ఇంట్లో అవార్డుల చోరీ.. తీరా క్షమించని లెటర్ రాసిన దొంగలు! #viral-news #marriege #rasagulla మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి