Chandrayaan-3: చంద్రుడిపై రోవర్ పని పూర్తైంది.. ఇస్రో కీలక ప్రకటన చంద్రయాన్-3 ప్రయోగంలో భాగంగా తనకు అప్పగించిన పనిని ప్రజ్ఞాన్ రోవర్ పూర్తి చేసిందని ఇస్రో తెలిపింది. ప్రస్తుతం స్లీప్ మోడ్‌లో సురక్షిత ప్రదేశంలో దానిని పార్క్ చేశామని పేర్కొంది. రోవర్, ల్యాండర్ విక్రమ్ సక్రమంగా పనిచేస్తున్నాయని.. ల్యాండర్ చుట్టూ రోవర్ ఇప్పటివరకు 100 మీటర్లు ప్రయాణించిందని తెలిపింది. By BalaMurali Krishna 03 Sep 2023 in నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి స్లీప్ మోడ్‌లోకి రోవర్.. చంద్రయాన్-3 ప్రయోగంలో భాగంగా తనకు అప్పగించిన పనిని ప్రజ్ఞాన్ రోవర్ పూర్తి చేసిందని ఇస్రో తెలిపింది. ప్రస్తుతం స్లీప్ మోడ్‌లో సురక్షిత ప్రదేశంలో దానిని పార్క్ చేశామని పేర్కొంది. రోవర్, ల్యాండర్ విక్రమ్ సక్రమంగా పనిచేస్తున్నాయని.. ల్యాండర్ చుట్టూ రోవర్ ఇప్పటివరకు 100 మీటర్లు ప్రయాణించిందని తెలిపింది. రోవర్ పేలోడ్స్‌ను ఆఫ్ చేశామని.. అందులోని డేలా ఇప్పటికే ల్యాండర్ ద్వారా తమకు చేరిందని చెప్పింది. ప్రస్తుతానికైతే దాని బ్యాటరీ ఫుల్‌గా చార్జ్ అయి ఉందని.. ఈనెల 22న చంద్రుడి మీద సూర్యకిరణాలు పడగానే దానికి బాధ్యతలు అప్పగిస్తామని వెల్లడించింది. తిరిగి ప్రారంభమై మళ్లీ తన పనిని కొనసాగిస్తుందని ఆశిస్తున్నామని లేదంటే జాబిల్లిపై భారత శాశ్వత రాయబారిగా రోవర్ అక్కడే నిలిచిపోతుందని ప్రకటించింది. Chandrayaan-3 Mission: The Rover completed its assignments. It is now safely parked and set into Sleep mode. APXS and LIBS payloads are turned off. Data from these payloads is transmitted to the Earth via the Lander. Currently, the battery is fully charged. The solar panel is… — ISRO (@isro) September 2, 2023 100 మీటర్ల దూరం ప్రయాణం.. అంతకుముందు చంద్రుడి ఉపరితలంపై రోవర్ 100 మీటర్ల దూరం ప్రయాణం పూర్తి చేసుకుందని ఇస్రో తెలిపింది. "ప్రజ్ఞాన్ 100 నాటౌట్" అంటూ ఓ ట్వీట్ చేసింది. రోవర్‌ని మరో రెండు రోజుల్లో స్లీప్ మోడ్‌లో పెడతామని ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ ప్రకటించారు. కాగా చంద్రుడి ఉపరితలంపై రెండు వారాల పాటు పరిశోధనలకు చంద్రయాన్-3 మిషన్‌కు రూపకల్పన చేశారు. జాబిల్లిపై విక్రమ్ ల్యాండర్ దిగి ఇప్పటికే 12 రోజులు పూర్తైంది. Chandrayaan-3 Mission: 🏏Pragyan 100* Meanwhile, over the Moon, Pragan Rover has traversed over 100 meters and continuing. pic.twitter.com/J1jR3rP6CZ — ISRO (@isro) September 2, 2023 లూనా-25 ప్రయోగం విఫలం.. ఇక చంద్రయాన్-3కి పోటీగా రష్యా ప్రయోగించిన లూనా-25 చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశిస్తూనే సాంకేతిక సమస్యతో కూలిపోయిన సంగతి తెలిసిందే. ఆగస్టు 10న రష్యా ప్రయోగించిన ఈ ఉపగ్రహం.. ఐదు రోజుల్లోనే దాదాపు 4 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రుడి కక్ష్యకు చేరింది. ఇస్రో కంటే రెండు రోజుల ముందే దక్షిణ ధ్రువంపై ల్యాండింగ్ కోసం మాస్కో ప్లాన్ చేసింది. దాదాపు 50 ఏళ్ల తర్వాత రష్యా చేపట్టిన ఈ ప్రయోగం విఫలమైంది. అదే సమయంలో భారత్ చేపట్టిన చంద్రయాన్3 ప్రయోగం విజయవంతమై ఇస్రో చరిత్ర సృష్టిచింది. దక్షిణ ధృవంపై కాలు మోపిన తొలి దేశంగా.. చంద్రుడిపై జెండా పాతిన నాలుగో దేశంగా రికార్డు నెలకొల్పింది. Aditya-L1 started generating the power. The solar panels are deployed. The first EarthBound firing to raise the orbit is scheduled for September 3, 2023, around 11:45 Hrs. IST pic.twitter.com/AObqoCUE8I — ISRO (@isro) September 2, 2023 ఆదిత్య ఎల్-1 ప్రయోగం సక్సెస్.. ఇదే ఊపుతో సూర్యుడిపై ఇస్రో చేపట్టిన ఆదిత్య ఎల్-1 ప్రయోగం కూడా విజయవంతమైంది. ఆదిత్య ఎల్-1 సుమారు 15 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించనుంది. ఈ ఉపగ్రహం సూర్యుని కక్ష్యలోకి చేరుకోవడానికి 128 రోజులు పడుతుంది. ఈ మిషన్ అత్యంత విశ్వసనీయమైన PSLV రాకెట్‌తో ప్రయోగించబడింది. ఇప్పటి వరకు అమెరికాతో సహా అనేక దేశాలు సూర్యుని అధ్యయనం కోసం ఉపగ్రహాలను పంపాయి. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి