పడుకున్న వెంటనే పిల్లలు నిద్రపోతారు.. ఎందుకంటే? పడుకున్న వెంటనే పిల్లలు నిద్రపోతారు.. ఎందుకో మీకు తెలుసా? ఎందుకంటే వారి మెదడులో జరిగే రసాయనిక చర్యలు కూడా దోహదం చేస్తాయని యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్‌కు చెందిన స్లీప్ సైంటిస్ట్ రెబెక్కా స్పెన్సర్, అలాగే మేరీలాండ్ యూనివర్సిటీకి చెందిన చైల్డ్ సైకాలజిస్ట్ ట్రేసీ రిగ్గిన్స్ కలిసి నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. By Shareef Pasha 19 Jun 2023 in లైఫ్ స్టైల్ Scrolling New Update షేర్ చేయండి కొంతమంది పిల్లలు ఇలా పడుకోగానే అలా నిద్రలోకి జారుకుంటారు. నిజానికిది ఎందుకు జరుగుతుందో మీకు తెలుసా? ఇది మంచి అలవాటే నిద్ర వారి బ్రెయిన్‌కు జిమ్ సెషన్ లాంటిది. అయితే ఇందుకు కారణం కేవలం వారి వయస్సు మాత్రమే కాదు, వారి మెదడులో జరిగే రసాయనిక చర్యలు కూడా దోహదం చేస్తాయని యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్‌కు చెందిన స్లీప్ సైంటిస్ట్ రెబెక్కా స్పెన్సర్, అలాగే మేరీలాండ్ యూనివర్సిటీకి చెందిన చైల్డ్ సైకాలజిస్ట్ ట్రేసీ రిగ్గిన్స్ కలిసి నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. పిల్లలు త్వరగా నిద్ర పోవడం అనేది అంతర్లీన జ్ఞాపకశక్తికి, మెదడు అభివృద్ధికి మధ్య సంబంధాన్ని కలిగి ఉంటుందని పరిశోధకులు అంటున్నారు. ముఖ్యంగా నిద్రపోతున్నప్పుడు వారి మెదడు జ్ఞాపకాలను ప్రాసెస్ చేయడంలో, నేర్చుకోవడంలో హార్డ్ వర్క్ చేస్తుంది. ఈ పరిస్థితి ‘హిప్పోకాంపస్’అనే నిద్రాణ స్థితిలో ఉన్నప్పుడు జరుగుతుంది. వాస్తవానికి హిప్పోకాంపస్ జ్ఞాపకాలను నిల్వ చేసే ‘బకెట్’ లాంటిదని పరిశోధకులు పేర్కొన్నారు. అయితే పిల్లల్లో ఇది పూర్తిగా డెవలప్ కాని పరిస్థితిలో ఉన్నప్పుడు, ఇది ఒక చిన్న బకెట్ లాగా పనిచేస్తుందని తెలిపారు. బకెట్ వేగంగా నీళ్లతో నిండినప్పుడు పొంగిపోయిన మాదరిగానే పిల్లల మెదడులోని హిప్పోకాంపస్ ఏరియా నేర్చుకొనే ప్రాసెస్‌లో జ్ఞాపకాలతో వేగంగా నిండిపోతుందని తెలిపారు. ఇలా జ్ఞాపకాలతో నిండిపోయిన పిల్లల మెదడులోని హిప్పోకాంపస్ ఏరియా వారు మరింత నేర్చుకునే పరిస్థితిని పుంజుకునే ప్రక్రియలో భాగంగా రసాయని చర్యలకు లోనవుతుందని, ఈ కారణంగానే పిల్లల్లో నిద్ర ముంచుకొస్తుందని పరిశోధకులు కనుగొన్నారు. అందుకే త్వరగా నిద్రపోతారని వెల్లడించారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి