Albania Parlement: పార్లమెంట్‌ లో బాంబు పేల్చిన ప్రతిపక్షం...ఎక్కడంటే!

ఆస్ట్రేలియాలోని అల్బెనియా పార్లమెంట్‌ లో ప్రతిపక్షాల వారు బాంబు పేల్చారు. అధికార పక్షం వారు చేసే పనులేవి కూడా నచ్చకపోవడంతో ప్రతిపక్షాల వారు ఈ పని చేసినట్లు అధికారులు వివరించారు.

New Update
Albania Parlement: పార్లమెంట్‌ లో బాంబు పేల్చిన ప్రతిపక్షం...ఎక్కడంటే!

పార్లమెంట్ అంటే సాధారణంగా ప్రతిపక్షాలు, అధికార పక్షాల వారు మాటల యుద్దం చేస్తుంటారు. కొన్ని సార్లు ఇరు పక్షాల వారు కూడా కాగితాలు చింపుకొని ఒకరి మీద ఒకరు వేసుకుంటుంటారు. అధికార పక్షం వారు చేసే పనులు కానీ, చెప్పే మాటలు కానీ ప్రతి పక్షం వారికి నచ్చకపోతే..వాకౌట్ చేస్తారు.

ఇరు పక్షాల మధ్య వాడి వేడి వాదనలు కూడా జరుగుతాయి. ఇది ఎక్కడైనా సహజమే. అయితే అధికార పక్షంతో పెట్టుకుని పార్లమెంటులో బాంబును పేల్చి మంటలు సృష్టించారు ప్రతి పక్షం వారు. ఈ సంఘటన అల్బేనియాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే..అల్బేనియా పార్లమెంట్‌ లో సోమవారం మంటలు చెలరేగాయి.

దీంతో పార్లమెంట్‌ ను 5 నిమిషాలలోనే ముగించారు. సోమవారం వచ్చే ఏడాది బడ్జెట్‌ పైన ఓటింగ్‌ నిర్వహించాలని సమావేశం ఏర్పాటు చేసింది అధికార పక్షం. ఈ నేపథ్యంలో ప్రధాని ఎది రామ తన సీట్‌ లో కూర్చోగానే..డెమోక్రాటిక్‌ ఎంపీలు వాదనకు దిగారు. ఇరు పక్షాల వారు కూడా వాదనలు మొదలు పెట్టాయి.

ఈ నేపథ్యంలో ప్రతిపక్ష సభ్యులు బీభత్సం సృష్టించారు. పార్లమెంట్‌ లో పొగ బాంబు పేల్చారు. దీంతో పార్లమెంట్‌ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అంతటితో ఆగకుండా హాల్‌ లోని కుర్చీలను ఒక దాని పై ఒకటి కుప్పగా పే్చి వాటిని తగలబెట్టారు. అలానే ప్రతిపక్షంగా ఉన్న డెమోక్రాటిక్ సభ్యులు అధికార పక్షంను గాయపరిచేందుకు వస్తుండగా భద్రత సిబ్బంది వాళ్ళను అడ్డుకున్నారు.

ఒక్కసారిగా పార్లమెంటులో ఘర్షణ వాతావరణం నెలకొన్నది. దీనితో అధికార వామపక్ష సోషలిస్టులు అత్యవసరంగా ఓటింగ్‌ పూర్తి చేసారు. అనంతరం కేవలం 5 నిమిషాల వ్యవధిలో సభను ముగించారు.

Also read: ఆ క్రికెటర్‌ కూతురుపై అసభ్యకర పోస్టులు.. ఇచ్చిపడేసిన స్టార్‌ ప్లేయర్ భార్య!

Advertisment
Advertisment
తాజా కథనాలు