TS News: రాష్ట్రంలో కొనసాగుతోన్న ఐపీఎస్ ల బదిలీలు..తాజాగా మరో ముగ్గురు బదిలీ.! తెలంగాణ రాష్ట్రంలో ఐపీఎస్ అధికారుల బదిలీలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ముగ్గురు ఐపీఎస్ అఫీసర్లు బదిలీ అయ్యారు. మల్టీజోన్ 1 ఐజీగా రంగనాథ్, టీఎస్ న్యాబ్ ఎస్పీగా శరత్ చంద్ర పవార్, ఆర్గనైజేషన్స్ ఐజీగా విశ్వప్రసాద్ ను నియామకం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. By Bhoomi 26 Feb 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి TS News: తెలంగాణ రాష్ట్రంలో ఐపీఎస్ అధికారుల బదిలీలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మరో ముగ్గురు ఐపీఎస్ అఫీసర్లను బదిలీ చేసింది సర్కార్. మల్టీజోన్ 1 ఐజీగా రంగనాథ్, టీఎస్ న్యాబ్ ఎస్పీగా శరత్ చంద్ర పవార్, ఆర్గనైజేషన్స్ ఐజీగా విశ్వప్రసాద్ ను నియామకం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతకు ముందు పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది రేవంత్ సర్కార్. ఈ మేరకు రాష్ట్ర సీఎస్ శాంతి కుమారి (CS Santhi Kumari) ఉత్తర్వులు జారీ చేశారు. * సిద్దిపేట (Siddipet) జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌ను నీటిపారుదల శాఖ స్పెషల్ సెక్రటరీగా బదిలీ * సిద్ధిపేట నూతన కలెక్టర్ గా కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరిని (Mikkilineni Manu Choudary) నియమించింది. * వరంగల్ మున్సిపల్ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషాను జనగాం జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేసింది. * అలాగే వరంగల్ (Warangal) జిల్లా కలెక్టర్ శివలింగయ్యను సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించింది. * ప్రస్తుత పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న శైలజా రామయ్యర్‌కు రెవెన్యూ ముఖ్య కార్యదర్శి బాధ్యతలను అదనంగా అప్పగించింది. ఇంతకాలం ఆ బాధ్యతలు (అదనపు హోదాలో) చూస్తున్న సునీల్ శర్మను అక్కడి నుంచి రిలీవ్ చేసింది రాష్ట్ర సర్కార్. ఇది కూడా చదవండి: కేవలం రూ. 10తో మీ కూతురు బంగారు భవిష్యత్‌కు బాట…స్కీం పూర్తి వివరాలివే..! #ips-transfers #ips-ranganath #ips-sharath-chandra-pawar #police-department మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి