Crime News: హైదరాబాద్ లో దారుణం.. అప్పు తీర్చలేదని భార్యాభర్తలను ఏం చేశారంటే.? అప్పు తీర్చలేదని దంపతులను దారుణంగా హత్య చేసిన ఘటన హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లో కలకలం రేపింది. అన్వర్ అనే వ్యక్తి నుంచి సయ్యద్, ఫాతిమా రూ.20 లక్షలు అప్పు తీసుకున్నారు. మూడేళ్లైన అప్పు చెల్లించకపోవడంతో అన్వర్ తన స్నేహితులతో కలిసి దంపతులను హత్య చేసినట్లు తెలుస్తోంది. By Jyoshna Sappogula 09 Dec 2023 in క్రైం తెలంగాణ New Update షేర్ చేయండి Crime News: హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. సయ్యద్ హమీద్, మిరాజ్ ఫాతిమా అనే దంపతులను దుండగులు అతి దారుణంగా చేశారు. ఆర్థిక వివాదాలే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలు ఏం జరిగిందంటే.? Also read: ఆస్పత్రిలో కేసీఆర్ ఎలా నడుస్తున్నారో చూడండి.. వీడియో మీకోసం.. ఫిలిం నగర్‌లోని సత్య కాలనీలో సయ్యద్ హమీద్, మిరాజ్ ఫాతిమా దంపతులు నివాసం ఉంటున్నారు. మూడు రోజులుగా ఫాతిమా.. తన సోదరి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఇంటికి వెళ్లి చూడగా.. ఆమె చనిపోయినట్లు కనిపించింది. అయితే, మొదటిగా పిల్లలు పుట్టకపోవడంతో ఫాతిమాని చంపి భర్త సయ్యద్ హమీద్ పారిపోయారని ఫాతిమా చెల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దంపతుల ఇంటి పరిసర ప్రాంతాల్లో సిసి ఫుటేజ్ నీ పోలీసులు పరిశీలించారు. అయితే, ఫాతిమాని చంపి ముగ్గురు బయటికి వస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. Also Read: రేగి పండ్లతో ఎన్నో ప్రయోజనాలు..అవేంటో తెలుసుకోండి! ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారణ చేయగా అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. మూడు ఏళ్ల క్రితం అన్వర్ అనే వ్యక్తి నుంచి సయ్యద్ హమీద్ గొర్రెల వ్యాపారం కోసం రూ. 20 లక్షలు అప్పు తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, అప్పు చెల్లించకుండా దంపతులు అతడిని ఇబ్బంది పెట్టారని.. దీంతో విసుగు చెందిన అన్వర్ తన ఫ్రెండ్స్ తో కలిసి సయ్యద్ హమీద్ ని కిడ్నాప్ చేసి హత్య చేశాడని సమాచారం. అనంతరం అతడిని ఇంటి దగ్గర లోని చెరువులో పాతిపెట్టినట్లు తెలుస్తోంది. అయితే, హత్య విషయం బయటికి రాకుండా ఉండేందుకు సయ్యద్ హమీద్ భార్య ఫాతిమాను సైతం గొంతు నులిమి హత్య చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లో జరిగిన డబుల్ మర్డర్ పై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు. #hyderbad మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి