Telangana Elections 2023 : రక్తాలు కారేలా తన్నుకున్న బీఆర్ఎస్ నేతలు..కేటీఆర్ రోడ్ షోలో ఘటన..!!

బీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణలు తారాస్థాయికి చేరుకున్నాయి. గోషామహల్ లో కేటీఆర్ పాల్గొన్న రోడ్ షోలో రక్తాలు కారేలా తన్నుకున్నారు. దిలీప్ ఘనాటే, రామచందర్ రాజుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ దాడిలో దిలీప్ ఘనాటేకు తీవ్ర రక్తస్రావమైంది.

New Update
Telangana Elections 2023 : రక్తాలు కారేలా తన్నుకున్న బీఆర్ఎస్ నేతలు..కేటీఆర్ రోడ్ షోలో ఘటన..!!

బీఆర్ఎస్ నేతలు మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో గ్రూపు రాజకీయాలు బయటపడ్డాయి.రక్తాలు కారేలా తన్నుకున్నారు. ఈ దాడిలో ఒకరు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఈ ఘటన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ తలపెట్టిన గోషామహల్ రోడ్ షోలో చోటుచేసుకుంది.

గోషామహల్ లో బీఆర్ఎస్ రోడ్ షో నిర్వహించింది. ఈ రోడ్ షో మంత్రి కేటీఆర్ పాల్గొన్ని ప్రసంగిస్తుండగానే ఘర్షణ షురూ అయ్యింది. ఈ ఘర్షణకు ప్రధానంగా ఉద్యమకారుడు దిలీప్ ఘనాటే, మాజీ కార్పొరేటర్ రామచందర్ రాజుల మధ్య చోటుచేసుకుంది. పార్టీ సమావేశాల గురించి తనకు సమాచారం ఇవ్వలేదని దిలీప్ ఘనాటే ప్రశ్నించారు. దీంతో రామచందర్ రాజు చిరాకు పడ్డాడు. తననే ప్రశ్నిస్తాడా అంటూ ఫైర్ అయ్యాడు. దిలీప్ పై భౌతిక దాడికి దిగాడు. దీంతో దిలీప్ కు తీవ్ర రక్తస్రావం జరిగింది. ఆయన అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. అక్కడున్న కార్యకర్తలు దిలీప్ ను వెంటనే ఆసుపత్రికి తరలించారు.

ఇది కూడా చదవండి:  మంత్రి కేటీఆర్ కు ఈసీ నోటీసులు

Advertisment
Advertisment
తాజా కథనాలు