Abhaya Case: కోల్‌కతా డాక్టర్‌ కేసులో కీలక పరిణామం..నలుగురు డాక్టర్లకు లై డిటెక్టర్‌ టెస్ట్‌!

కోల్‌కతా ట్రైనీ డాక్టర్‌ అభయ హత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆర్జీకర్‌ మాజీ ప్రిన్సిపల్‌ తో పాటు మరో నలుగురు డాక్టర్లకు సీబీఐ నేడు లై డిటెక్టర్ టెస్ట్‌ నిర్వహించనుంది. ఇప్పటికే ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌ కు లై డిటెక్టర్‌ టెస్ట్‌ కు అనుమతులు లభించాయి.

New Update
Kolkata Tragedy: కోల్‌కతా అత్యాచారం-హత్య కేసు.. మాజీ ప్రిన్సిపాల్ ఇంటిపై సీబీఐ దాడులు

Abhaya Case: కోల్‌కతా వైద్యురాలు అభయ హత్యాచార కేసును సీబీఐ వేగవంతం చేసింది. కోల్‌కతా హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన వెంటనే రంగంలోకి దిగిన అధికారులు ఇప్పటికే పలు కీలక విషయాలను రాబట్టారు. అయితే రంగంలోకి దిగకముందే క్రైమ్ సీన్ ఆనవాళ్లు చెరిపేసినట్లుగా అధికారులు గుర్తించారు. దీంతో దర్యాప్తు సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. కోల్‌కతా ఆర్జీ కర్ ఆస్పత్రి అండ్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్‌ సందీప్‌ ఘోష్‌ సహా , అభయతో చివరిగా మాట్లాడిన నలుగురు వైద్యులకు కూడా లై డిటెక్టర్‌ టెస్ట్‌ చేసేందుకు అధికారులు రెడీ అయ్యారు.

సీబీఐ చేసిన విజ్ఞప్తి కి కోల్‌కతాలోని ప్రత్యేక కోర్టు అనుమతించింది. ఇప్పటికే నిందితుడు సంజయ్ రాయ్‌కు లై డిటెక్టర్ టెస్ట్‌ కు అనుమతి వచ్చింది. సీబీఐ విచారణలో సందీప్ ఘోష్ పొంతనలేని సమాధానాలు చెబుతుండడంతో పాటు... ఆయన విచారణకు ఏ మాత్రం సహకరించడం లేదని సమాచారం. ఇక ఈ ఘటన తర్వాత.. సందీప్ ఘోషే.. బాధిత కుటుంబానికి తప్పుడు సమాచారం ఇప్పించినట్లుగా సమాచారం.

అంతేకాకుండా ఒక ప్రణాళిక ప్రకారం క్రైమ్ ఆఫ్ సీన్‌ కూడా మార్చేసినట్లుగా సీబీఐ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది. సందీప్ ఘోష్‌తో సహా మరో నలుగురు వైద్యులు ఆయనతోనే ఉన్నట్లుగా సీబీఐ అధికారులు భావిస్తున్నారు. మరింత సమాచారం రాబట్టడం కోసం లైడిటెక్టర్ టెస్ట్‌ కు రెడీ అయింది. దీంతో కీలక సమాచారాన్ని సీబీఐ రాబట్టనుంది.

Aslo Read: 156 ఔషధాలపై కేంద్రం నిషేధం…వాటిలో ఈ మందులు కూడా..!

Advertisment
Advertisment
తాజా కథనాలు