The Kerala Story: ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘ది కేరళ స్టోరీ’.. స్ట్రీమింగ్ డేట్ ఇదే నటి ఆదా శర్మ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ది కేరళ స్టోరీ’. గతేడాది విడుదలైన ఈ చిత్రం మొత్తానికి 9 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఫిబ్రవరి 16 నుంచి ఓటీటీ వేదిక జీ5 లో స్ట్రీమింగ్ కానున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. By Archana 07 Feb 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి The Kerala Story OTT Release: సుదీప్తో సేన్ (Sudipto Sen) దర్శకత్వంలో ఆదాశర్మ (Adah Sharma) ప్రధాన పాత్రలో నటించిన హిందీ డ్రామా ఫిలిం ‘ది కేరళ స్టోరీ’. గతేడాది మే 5న విడుదలైన ఈ చిత్రం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇటు సినిమా, రాజకీయంగానూ ప్రకంపనలు సృష్టించింది. మత పరమైన అంశాలతో కూడిన ఈ సినిమా .. అనౌన్స్ చేసిన దగ్గర నుంచి వివాదాస్పదంగా మారింది. కొన్ని రాష్ట్రాలు అయితే ఏకంగా ఈ సినిమానే బ్యాన్ చేశాయి. ఇక గతేడాది హాట్ టాపిక్ గా మారిన ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా.. అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక మొత్తానికి రిలీజైన తొమ్మిది నెలల తరువాత ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ‘ది కేరళ స్టోరీ’ ఓటీటీ రిలీజ్ View this post on Instagram A post shared by ZEE5 (@zee5) ‘ది కేరళ స్టోరీ’ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 (Zee5) దక్కించుకుంది. ఫిబ్రవరి 16 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపింది. తమిళ్, తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఓటీటీ రిలీజ్ డేట్ కు సంబంధించి జీ5 సంస్థ ఓ వీడియోను కూడా రిలీజ్ చేసింది. ఇందులో ‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story) ఓటీటీ రిలీజ్ ఎప్పుడని ఎంతో మంది ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలను చూపిస్తూ.. "ద వెయిట్ ఈజ్ ఓవర్ " అంటూ రిలీజ్ డేట్ రివీల్ చేశారు. ఇక థియేటర్స్ లో సూపర్ హిట్ రెస్పాన్స్ పొందిన ఈ సినిమా ఓటీటీలో ఎలా అలరించబోతుందో చూడాలి. విపుల్ అమృత్‌లాల్ షా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిమాహ్‌గా యోగితా, సోనియా బలానీ, సిద్ధి ఇద్నాని, దేవదర్శిని, ప్రణాలి ఘోగారే కీలక పాత్రల్లో నటించారు. కేరళకు చెందిన నలుగురు యువతులను మతం మార్చి .. ఐసిస్ లాంటి ప్రమాదకర ఉగ్రవాద సంస్థల్లో ఎలా జాయిన్ చేశారో అనేదే ఈ సినిమా కథాంశం. Also Read: Hanuman Collections: 25 రోజుల్లో 300 కోట్ల వసూళ్లు .. హనుమాన్ రికార్డు.. వైరలవుతున్న ప్రశాంత్ వర్మ పోస్ట్ #adah-sharma #the-kerala-story #sudipto-sen మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి