The Kerala Story: ఓటీటీలో "ది కేరళ స్టోరీ" రికార్డు.. 300 మిలియన్ వాచ్ మినిట్స్

సుదీప్తో సేన్ దర్శకత్వంలో అదా శర్మ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ది కేరళ స్టోరీ. ఇటీవలే OTTలో రిలీజైన ఈ చిత్రం రికార్డు వ్యూస్ తో దూసుకెళ్తోంది. ఫిబ్రవరి 16 నుంచి స్ట్రీమైన ఈ మూవీ ఇప్పటికీ ట్రెండింగ్ గా కొనసాగుతోంది. 300 మిలియన్ వాచ్ మినిట్స్ తో రికార్డు సృష్టించింది.

New Update
The Kerala Story:  ఓటీటీలో "ది కేరళ స్టోరీ" రికార్డు.. 300 మిలియన్ వాచ్ మినిట్స్

Kerala Story Trending in OTT With Record Views: సినిమా రంగంలోనే కాదు రాజకీయంగానూ ప్రకంపనలు సృష్టించిన చిత్రం "ది కేరళ స్టోరీ". గతేడాది ఎన్నో వివాదాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. ఇటీవలే ఓటీటీలో విడుదలైన సంగతి తెలిసిందే. థియేటర్స్ లో రిలీజైన తొమ్మిది నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన "ది కేరళ స్టోరీ" అంచనాలకు మించిన వ్యూస్ సాధిస్తోంది. రికార్డు వ్యూస్ తో ఓటీటీలోనూ సత్తాచాటుతుంది.

Rashmika Mandanna: ఎయిర్ పోర్ట్ లో రష్మికకు జపాన్ ఫ్యాన్స్ సర్ప్రైజ్.. ఏం చేశారో తెలిస్తే షాకవుతారు..!

ఓటీటీలో "ది కేరళ స్టోరీ" రికార్డు

ఫిబ్రవరి 16 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ జీ5 (Zee5) వేదికగా స్ట్రీమైన ఈ చిత్రం ఇప్పటికీ టాప్ వన్ ట్రెండింగ్ గా కొనసాగుతోంది. రిలీజైన 15 రోజుల్లోనే 300 మిలియన్ పైగా వాచ్ మినిట్స్ సొంతం చేసుకొని రికార్డు క్రియేట్ చేసింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ జీ5 పోస్టర్ ను రిలీజ్ చేసింది.

Kerala Story Trending in OTT With Record Views

సుదీప్తో సేన్ (Sudipto Sen) దర్శకత్వంలో అదా శర్మ (Adah Sharma), యోగితా బిహానీ, సోనియా బలానీ, సిద్ధి ఇద్నానీ ప్రధాన పాత్రలో నటించారు. విపుల్ అమృత్ లాల్ షా ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. కేరళకు చెందిన నలుగురు యువతులు.. ఐసిస్ లాంటి ఉగ్రవాద సంస్థలో ఎలా జాయిన్ అయ్యారు..? అనేది ఈ సినిమా కథ.

Also Read: Manchu Vishnu: భర్త అంటే ఇలా ఉండాలి .పెళ్లి రోజు గిఫ్ట్ గా భార్యని మంచు విష్ణు ఎలా సప్రైజ్ చేశాడంటే..?

#adah-sharma #the-kerala-story-ott-release #the-kerala-story
Advertisment
Advertisment
తాజా కథనాలు