Vyuham : ‘వ్యూహం’ సినిమా సర్టిఫికేట్ హైకోర్టు రద్దు చేయలేదు.. ఆర్జీవీ ట్వీట్ వ్యూహం సినిమా CBFC సర్టిఫికేట్ తెలంగాణ హైకోర్టు రద్దు చేసిందని జరుగుతున్న ప్రచారానికి ఆర్జీవీ చెక్ పెట్టారు. వ్యూహం సర్టిఫికేట్ ను హైకోర్టు రద్దు చేయలేదని ట్విట్టర్ ద్వారా తెలిపారు. By V.J Reddy 29 Dec 2023 in ఆంధ్రప్రదేశ్ సినిమా New Update షేర్ చేయండి RGV Vyuham Movie : రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) ఏపీ రాజకీయాల ఆధారంగా తెరకెక్కించిన 'హ్యూహం' సినిమా విడుదలకు హైకోర్టు బ్రేక్ వేసిన విషయం తెలిసిందే. తాజాగా వ్యూహం సినిమా CBFC సర్టిఫికేట్ హైకోర్టు రద్దు చేసిందంటూ జరుగుతున్న ప్రచారంపై ఆర్జీవీ స్పందించారు. ‘వ్యూహం’ సినిమా CBFC సర్టిఫికేట్ హైకోర్టు రద్దు చేయలేదని పేర్కొన్నారు. జనవరి 11 వరకు CBFC ని సంబందిత వివరాలు సమర్పించమని హైకోర్టు ఆదేశించిందని అన్నారు. తదుపరి విచారణ జనవరి 11 కు వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. ఈ ఛానల్ @abntvtelugu కి సంబంధించిన ఈ వ్యక్తి , ఇంకా మరి కొన్ని ఛానళ్ళు చెప్తున్నట్టు వ్యూహం సినిమా సెన్సార్ సర్టిఫికేట్ “రద్దు” అవ్వలేదు.. నిజం ఏమిటంటే కోర్టు CBFC నుంచి సర్టిఫికేట్ ఇవ్వటానికి సంబంధించిన రికార్డులు జనవరి 12th కల్లా సబ్మిట్ చెయ్యాలని అడిగారు https://t.co/hB5ak477cR — Ram Gopal Varma (@RGVzoomin) December 29, 2023 ‘వ్యూహం’కు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) జారీని తెలగుదేశం పార్టీ రద్దు చేయమని కోరిందని అన్నారు. పార్టీ జెండాలు, నేతల పేర్లతో చిత్రం తీశారని, ఇది పలు పార్టీల నేతల పరువు నష్టం కలిగించేదిగా ఉందని పిటిషనర్ తరఫున న్యాయవాది మురళీధర్‌రావు వాదించారు. రిట్ పిటిషన్ మెయింటెనబుల్ కాదు. ప్రజాప్రతినిధ్య చట్టంలోని సెక్షన్ 29(ఏ) ప్రకారం ఈ పిటిషన్ వేసే అర్హత పిటిషనర్‌కు లేదు.. ఎవరి పరువుకు నష్టం కలుగుతుందని భావిస్తే.. వారే న్యాయస్థానాన్ని ఆశ్రయించాలి, చిత్రం చూడకుండానే పరువుకు నష్టం వాటిల్లుతుందని.. ఊహించి పిటిషన్ వేయడం ఆక్షేపణీయం.. గతంలో సైరా నరసింహారెడ్డి చిత్రంపై కొందరు ఇదే హైకోర్టును ఆశ్రయించారు.. చిత్రం చూడకుండానే ఆరోపణలు చేయడం సరికాదంటూ పిటిషన్‌ను ద్వి సభ్య ధర్మాసనం గతంలో కొట్టివేసింది.. నిపుణులతో కూడిన కమిటీ కూర్చొని చిత్రాన్ని చూసి ఏకగ్రీవంగా సర్టిఫికెట్ జారీ చేసింది. వ్యక్తులను, పార్టీలను కించపరిచే విధంగా ఉంటే సివిల్ కోర్టులో వారు పరువు నష్టం దావా వేసుకోవాలని నిర్మాత-దర్శకుడి తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. హైకోర్టులో వేయడం తప్పుబట్టాల్సిన అంశం పిటిషన్‌ను కొట్టివేయాలి అని సీబీఎఫ్‌సీ తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ వాదనలు వినిపించారు. సినిమాటోగ్రాఫ్ చట్టం, ఫిల్మ్ సర్టిఫికేషన్ మార్గదర్శకాలు, ఆర్టికల్ 19(1)(ఎ) ప్రకారం భావ ప్రకటన హక్కును పరిగణనలోకి తీసుకుని రివైజింగ్ కమిటీ ఏకగ్రీవంగా 'యు' సర్టిఫికెట్ మంజూరు చేసిందని కోర్టుకు తెలిపారు. ALSO READ: ఆ 50 మందికి షాక్.. రేపు సీఎం జగన్ కీలక ప్రకటన? గుడ్ న్యూస్.. నేడే అకౌంట్లోకి డబ్బు జమ #telangana-high-court #ram-gopal-varma #rgv #rgv-vyuham #rgv-vyuham-banned మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి