High Court of Gujarat: రక్షకులే నేరస్థులుగా మారితే ఎలా?...హైకోర్టు ఆగ్రహం..!! ట్రాఫిక్ పోలీసులపై గుజరాత్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అహ్మదాబాద్‌కు చెందిన దంపతుల నుంచి ట్రాఫిక్ పోలీసులు డబ్బు రికవరీ చేయడంపై గుజరాత్ హైకోర్టు మండిపడింది. ట్రాఫిక్ పోలీసుల తీరుపై గుజరాత్ హైకోర్టు ప్రశ్నలు లేవనెత్తింది. రక్షకులే నేరస్థులుగా మారే పరిస్థితి గురించి ఆందోళన వ్యక్తం చేసింది. By Bhoomi 12 Sep 2023 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి ట్రాఫిక్ పోలీసులపై గుజరాత్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అహ్మదాబాద్‌కు చెందిన దంపతుల నుంచి ట్రాఫిక్ పోలీసులు డబ్బు రికవరీ చేయడంపై గుజరాత్ హైకోర్టు మండిపడింది. ట్రాఫిక్ పోలీసుల తీరుపై గుజరాత్ హైకోర్టు ప్రశ్నలు లేవనెత్తింది. రక్షకులే నేరస్థులుగా మారే పరిస్థితి గురించి ఆందోళన వ్యక్తం చేసింది. అహ్మదాబాద్‌కు చెందిన ఓ జంట నుంచి ట్రాఫిక్ పోలీసులు డబ్బు రికవరీ చేయడంపై గుజరాత్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అహ్మదాబాద్‌లో, ఇద్దరు ట్రాఫిక్ పోలీసు కానిస్టేబుళ్లు రాత్రి క్యాబ్‌లో ప్రయాణిస్తున్న జంట నుండి డబ్బు వసూలు చేసిన ఘటన కలకలం రేపింది. గుజరాత్ హైకోర్టు సుమోటో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (Suo Motu PIL)పై విచారణ సందర్భంగా ట్రాఫిక్ పోలీసులపై ఈ వ్యాఖ్యలు చేసింది కోర్టు. ఇది కూడా చదవండి: అభిమానికి ఆటోగ్రాఫ్ ఇచ్చిన ధోని.. ఏం చేశాడో తెలుసా? ఈ ఘటను సంబంధించి నివేదిక ఇవ్వాలని చీఫ్ జస్టిస్ సునీతా అగర్వాల్, జస్టిస్ అనిరుద్ధ పి.మయిలతో కూడిన డివిజన్ బెంచ్ కోరింది. గుజరాత్‌లోని ఇతర నగరాల్లో ఇలాంటి ఘటనలు జరిగాయా అని ప్రశ్నించారు. ట్యాక్సీలలో హెల్ప్‌లైన్ నంబర్‌లను ఏర్పాటు చేయడం వల్ల ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు సహాయం అందేలా చూడాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఈ విషయం వెలుగులోకి రావడంతో ఆ మరుసటి రోజే ట్రాఫిక్ అధికారులు, టీఆర్‌బీ జవాన్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని, ఒకరోజు తర్వాత అరెస్టు చేశామని ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశామని న్యాయవాది మనీషా లవకుమార్ షా తెలిపారు. TRB జవాన్ సర్వీస్ రద్దు చేయడంతోపాటు అన్ని పోలీస్‌స్టేషన్‌ల ఇన్‌చార్జి అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేసినట్లు షా వెల్లడించారు ఇది కూడా చదవండి: చంద్రబాబుకు రిమాండ్ తీర్పు ఇచ్చిన జస్టిస్ హిమ బిందు గురించి ఈ విషయాలు తెలుసా? సస్పెండ్ అయిన కానిస్టేబుళ్లపై శాఖాపరమైన విచారణను గడువులోగా పూర్తి చేయాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ప్రస్తుతం ఈ కేసు తర్వాతి చారణ సెప్టెంబర్ 20న జరగనుంది. #gujarat-high-court #extorting-money #perpetrators #protectors #traffic-cops మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి