Lasya Nanditha: అశ్రునయనాల మధ్య ముగిసిన ఎమ్మెల్యే లాస్య నందిత అంత్యక్రియలు..!!

అశ్రునయనాల మధ్య బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత అంత్యక్రియలు ముగిశాయి. అధికారిక లాంఛనాలతో మారేడ్ పల్లిలోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. లాస్య అంత్యక్రియలకు బంధుమిత్రులు, అభిమానులు, రాజకీయ పార్టీల నేతలు, ప్రముఖుల మధ్య ఆమె అంతిమయాత్ర సాగింది.

New Update
Lasya Nanditha: అశ్రునయనాల మధ్య ముగిసిన ఎమ్మెల్యే లాస్య నందిత అంత్యక్రియలు..!!

Lasya Nanditha:  సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత అంత్యక్రియలు ముగిశాయి. బంధువులు, అభిమానులు, రాజకీయ ప్రముఖులు ఆమెకు కన్నీటి వీడ్కోలు పలికారు. మారేడ్ పల్లిలోని శ్మశానవాటికలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో లాస్య అంత్యక్రియలు ముగిశాయి.

publive-image

ఖర్ఖానాలోని ఎమ్మెల్యే నివాసం దగ్గర నుంచి అంతిమ యాత్ర సాగింది. ఈ యాత్రలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు, నాయకులు పాల్గొన్నారు. మాజీ మంత్రి హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి సహా పలువురు లాస్య పాడెను మోశారు. లాస్య నందిత మృతికి అన్ని పార్టీల నాయకులు సంతాపం తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, మాజీసీఎం కేసీఆర్, లాస్య భౌతిక కాయానికి నివాళులర్పించారు.

publive-image

ఈరోజు ఉదయం పటాన్ చెరు ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో లాస్య నందిత అక్కడిక్కడే మరణించిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదం పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె సోదరి నివేదిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పఠాన్ చెరు పోలీసులు. 304ఏ ఐపీసీ సెక్షన్ కింద లాస్య పీఏ ఆకాష్ పై కేసు నమోదు చేశారు. 

ఇది కూడా చదవండి: ఎమ్మెల్యే లాస్య మృతి.. పీఏపై కేసు నమోదు

Advertisment
Advertisment
తాజా కథనాలు