Lok Sabha Elections: ఆరో దశ లోక్ సభ ఎన్నికల పోలింగ్ @63.37 శాతం లోక్ సభ ఎన్నికల్లో భాగంగా ఆరో దశలో జరిగిన పోలింగ్లో 63.37 శాతం ఓటింగ్ నమోదైనట్టు ఎన్నికల సంఘం మంగళవారం వెల్లడించింది. 11.13 కోట్ల మంది ఓటర్లకు 7.05 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు తెలిపింది. By V.J Reddy 29 May 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Lok Sabha Elections: దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు మొత్తం ఏడు దశల్లో కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పటి వరకు ఆరు దశల్లో లోక్ సభ ఎన్నికలు ముగిశాయి. తాజాగా ఆరో దశలో జరిగిన పోలింగ్ శాతాన్ని వెల్లడించింది. ఆరవ దశలో 63.37 శాతం ఓటింగ్ నమోదైనట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది. 11.13 కోట్ల మంది ఓటర్లకు 7.05 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు పేర్కొంది. ఇందులో పురుషుల ఓటింగ్ శాతం 61.95 శాతం కాగా, మహిళలది 64.95 శాతంగా ఉందని వెల్లడించింది. పశ్చిమ బెంగాల్లో అత్యధికంగా 82.71 శాతం పోలింగ్ నమోదు అయినట్లు తెలిపింది. ఉత్తరప్రదేశ్లోని 14 నియోజకవర్గాల్లో 54.04 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు పేర్కొన్నారు. * ఢిల్లీలో 58.69 శాతం, * హర్యానాలో 64.80 శాతం, * ఒడిశాలో 74.45 శాతం, * జార్ఖండ్లలో 65.39 శాతం పోలింగ్ నమోదైంది. * లోక్ సభ నియోజకవర్గాల వారీగా పశ్చిమ బెంగాల్లోని బిష్ణుపూర్లో అత్యధికంగా 85.91శాతం పోలింగ్ నమోదు కాగా, ఉత్తరప్రదేశ్లోని ఫుల్పూర్లో అత్యల్పంగా 48.91శాతం పోలింగ్ నమోదు అయినట్లు వెల్లడించింది. ఇప్పటివరకు జరిగిన ఆరు దశల్లో 69.58 శాతం ఓటింగ్ నమోదైందని ఈసీ తెలిపింది. కాగా, ఢిల్లీలోని ఏడు స్థానాలతో సహా 58 లోక్సభ నియోజకవర్గాలకు మే 25న పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. #election-commission మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి