Singareni Election Results: లాల్‌ సలామ్‌.. సింగరేణి సమరంలో ఏఐటీయూసీ జయకేతనం !

హోరాహోరీగా సాగిన సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో సీపీఐ అనుబంధ AITUC గెలిచింది. ఏఐటీయూసీకి సింగరేణి ఓటర్లు పట్టం కట్టారు. దీంతో గుర్తింపు సంఘంగా ఏఐటీయూసీ ఆవిర్భవించింది.

New Update
Singareni Election Results: లాల్‌ సలామ్‌.. సింగరేణి సమరంలో ఏఐటీయూసీ జయకేతనం !

సింగరేణి బొగ్గు గనులపై ఎర్రజెండా రెపరెపలాడింది. AITUCకి గుర్తింపు సంఘంగా సంగరేణి కార్మికులు పట్టం కట్టారు. సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల్లో AITUCవిక్టరీ కొట్టింది. సీపీఐ అనుబంధ ఏఐటీయూసీ సత్తా చాటడంతో గుర్తింపు సంఘంగా ఏఐటీయూసీ ఆవిర్భవించింది. ఏఐటీయూసీకి సింగరేణి ఓటర్లు జై కొట్టారు. మొత్తంగా ఏఐటీయూసీ దాదాపు రెండువేల ఓట్ల తేడాతో నెగ్గింది.

AITUC గెలిచినవి:
➼ బెల్లంపల్లి - 122
➼ మందమర్రి - 467
➼ శ్రీరాంపూర్ - 2166
➼ రామగుండం-1 -417
➼ రామగుండం-2 - 333
మొత్తం ఓట్లు = 3465 మెజారిటీ

INTUC గెలిచినవి
➼ కార్పొరేషన్ - 296
➼ కొత్తగూడెం - 233
➼ మణుగూరు - 2
➼ ఇల్లందు - 46
➼ భూపాలపల్లి - 801
➼ రామగుండం-3 - 104
మొత్తం = 1482 మెజారిటీ.

మొత్తంగా:
➼ AITUC మెజారిటీ =3465
➼ INTUC మెజారిటీ =1482

తేడా =1983

గత ఎన్నికల్లో ప్రాతినిధ్యం ఇలా:
➼ 1998–ఏఐటీయూసీ
➼ 2001–ఏఐటీయూసీ
➼ 2003–ఐఎన్‌టీయూసీ
➼ 2007–ఏఐటీయూసీ
➼ 2012–టీజీబీకేఎస్‌
➼ 2017–టీజీబీకేఎస్‌
➼ 2023–ఏఐటీయూసీ

Also Read: ఘోర ప్రమాదం…ప్రయాణికులతో వెళ్తున్న బస్సులో అగ్నిప్రమాదం…12మంది సజీవ దహనం..!!

WATCH:

Advertisment
Advertisment
తాజా కథనాలు