Sarfaraz Khan: ఇక నాకు తుది జట్టులో స్థానం కష్టమే.. స్టార్ బ్యాటర్ షాకింగ్ కామెంట్స్!

దేశవాళీ క్రికెట్‌లో ఎంత ప్రతిభ చూపించినప్పటికీ అవకాశాలు అనుకున్నంతగా రావట్లేదని సర్ఫరాజ్ ఖాన్ అన్నాడు. ఎన్ని ట్రోఫీలు ఆడినా భారత తుది జట్టుకు ఎంపిక కష్టమేనంటూ అసంతృప్తి వ్యక్తం చేశాడు. బంగ్లాదేశ్‌తో సెప్టెంబర్ 19 నుంచి జరగబోయే రెండు టెస్టుల సిరీస్‌లో చోటు దక్కలేదు.

New Update
Sarfaraz Khan: ఇక నాకు తుది జట్టులో స్థానం కష్టమే.. స్టార్ బ్యాటర్ షాకింగ్ కామెంట్స్!

Sarfaraz Khan: బంగ్లాదేశ్‌తో సెప్టెంబర్ 19 నుంచి జరగబోయే రెండు టెస్టుల సిరీస్‌లో చోటు దక్కకపోవడంపై స్టార్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్ని ట్రోఫీలు ఆడినా తనకు తుది జట్టులో స్థానం దక్కడం కష్టమేనంటూ అసంతృప్తి వ్యక్తం చేశాడు. దేశవాళీ క్రికెట్‌లో మంచి ప్రతిభ చూపించినప్పటికీ అవకాశాలు అనుకున్నంతగా రాలేదని, ఇప్పుడు మరోసారి అందే రిపీట్ అయిందంటూ ఆందోళన వ్యక్తం చేశాడు.

బెస్ట్ బ్యాటర్‌గా మారేందుకు అవకాశం..
‘ఎలాంటి అంచనాలు లేకుండానే నేను బరిలోకి దిగుతున్నా. నాకు అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్తున్నా. భవిష్యత్తులోనూ ఇలాగే నడుచుకుంటాం. ఏదో ఒక రోజు నాకు బ్రేక్ వస్తుందని భావిస్తున్నా. కాస్త ఓపిక పట్టాలి. ఇలా జరగడం నాకు కలిసొచ్చే అంశమే. మరింత ఎక్కువగా దేశవాళీ క్రికెట్‌ ఆడతా. ఇక్కడ బెస్ట్ బ్యాటర్‌గా మారేందుకు అవకాశం లభిస్తుంది' అన్నాడు. ఇక ఇంగ్లాండ్‌పై టెస్టు అరంగేట్రం చేసిన సర్ఫరాజ్‌ తొలి మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ చేసి ఔరా అనిపించాడు. మొత్తం మూడు టెస్టులు ఆడిన సర్ఫరాజ్.. 200 పరుగులు చేశాడు. ఇందులో మూడు అర్ధశతకాలు ఉండటం గమనార్హం.

Advertisment
Advertisment
తాజా కథనాలు