Kedarnath Yatra: కేదార్‌నాథ్ యాత్రకు తాత్కాలికంగా బ్రేక్

కేదార్‌నాథ్‌లో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ క్రమంలో యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు అధికారులు. కొండచరియలు విరిగిపడి 18 మంది గల్లంతయ్యారు. 16 వందల మంది యాత్రికులు కేదార్‌నాథ్‌లో చిక్కుకున్నారు. వీరిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

New Update
Kedarnath Yatra: కేదార్‌నాథ్ యాత్రకు తాత్కాలికంగా బ్రేక్

Kedarnath Yatra : కేదార్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు అధికారులు. కొండచరియలు (Landslides) విరిగిపడి 18 మంది గల్లంతయ్యారు. కేదార్‌నాథ్‌ (Kedarnath) లో 16 వందల మంది యాత్రికులు చిక్కుకున్నారు. భారీ వర్షాలకు (Heavy Rains) కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఆర్మీ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. గౌరీకుండ్‌ - కేదార్‌నాథ్‌ దారిలో భక్తులు చిక్కుకుపోయారు. ఇప్పటి వరకు 3 వేల మందిని రెస్క్యూ టీమ్స్‌ రక్షించాయి. గల్లంతైన వారికోసం హెలికాప్టర్లు, డోన్లతో సహాయక బృందాలు గాలిస్తున్నాయి. హరిద్వార్‌, తెహ్రీ, డెహ్రాడూన్‌, చమోలీ జిల్లాల్లో ఆకస్మిక వరదలు పోటెత్తాయి.

Also Read : జాబ్ లెస్ క్యాలెండర్ గురించి వివరణ ఇవ్వండి.. రాహుల్‌కు కేటీఆర్ ట్వీట్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

IPL 2025: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్

చండీగఢ్‌ వేదికగా రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పంజాబ్ తమ జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. రాజస్థాన్ మాత్రం తమ టీమ్‌లో రెండు మార్పులు చేసింది.

New Update
Punjab Kings VS Rajastan Royals

Punjab Kings VS Rajastan Royals

చండీగఢ్‌ వేదికగా రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పంజాబ్ తమ జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. రాజస్థాన్ మాత్రం తమ టీమ్‌లో రెండు మార్పులు చేసింది. కెప్టెన్ సంజూ శాంసన్‌ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చేశాడు. మరోవైపు తుషార్ దేశ్ పాండే గాయం వల్ల ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. అతడి స్థానంలో యుద్ద్‌వీర్‌ సింగ్ వచ్చాడు.  

రాజస్థాన్ రాయల్స్ టీమ్

యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (కెప్టెన్‌), నితీష్ రాణా, రియాన్ పరాగ్, ధృవ్ జురెల్ (వికెట్ కీప‌ర్‌), షిమ్రోన్ హెట్మెయర్, వనిందు హసరంగా, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, యుధ్వీర్ సింగ్ చరక్, సందీప్ శర్మ

పంజాబ్ కింగ్స్ టీమ్  

ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్ కీప‌ర్‌), శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్‌), మార్కస్ స్టోయినిస్, నెహాల్ వధేరా, గ్లెన్ మాక్స్‌వెల్, శశాంక్ సింగ్, సూర్యాంశ్ షెడ్జ్, మార్కో జాన్సెన్, అర్ష్‌దీప్ సింగ్, లాకీ ఫెర్గూసన్, యుజ్వేంద్ర చాహల్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు