AP Assembly: బాలయ్య విజిల్..బాబు సీటెక్కి మరీ..ఇద్దరు ఎమ్మెల్యేల సస్పెన్షన్‌!

టీడీపీ సభ్యులు చంద్రబాబు అరెస్ట్ (Arrest) ని నిరసిస్తూ రచ్చరచ్చ చేశారు.అసెంబ్లీ గౌరవ మర్యాదలు మరిచిపోయి..చంద్రబాబు నాయుడు కుర్చీ ఎక్కి మరీ ఆయన విజిల్ వేయడం మొదలుపెట్టారు.

New Update
AP Assembly: బాలయ్య విజిల్..బాబు సీటెక్కి మరీ..ఇద్దరు ఎమ్మెల్యేల సస్పెన్షన్‌!

ఏపీ అసెంబ్లీ(AP Assembly) సమావేశాలు మొదలైనప్పటి నుంచి కూడా వాడివేడిగా జరుగుతున్నాయి. టీడీపీ(TDP) సభ్యుల ఆందోళనతో సమావేశాల్లో రచ్చరచ్చ అవుతుంది. గురువారం జరిగిన సమావేశాల్లో కూడా టీడీపీ సభ్యులు టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu Naidu) ని అరెస్ట్‌ చేసిన విషయం గురించి టీడీపీ నేతలు, సభ జరగకుండా అడ్డుకున్నారు.

ఈ క్రమంలోనే గురువారం నాడు సభ కొద్దిసేపు వాయిదా పడింది కూడా. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ(Balakrishna) వైసీపీ (YCP) సభ్యులను చూసి మీసం మేలేసి, తొడ కొట్టారు. దీంతో వైసీపీ నాయకులు రెచ్చిపోయి కౌంటర్లు ఇచ్చారు.

ఈ క్రమంలో శుక్రవారం ఉదయం సభ మొదలైనప్పటికీ మళ్లీ టీడీపీ సభ్యులు చంద్రబాబు అరెస్ట్ (Arrest) ని నిరసిస్తూ రచ్చరచ్చ చేశారు.అసెంబ్లీ గౌరవ మర్యాదలు మరిచిపోయి..చంద్రబాబు నాయుడు కుర్చీ ఎక్కి మరీ ఆయన విజిల్ వేయడం మొదలుపెట్టారు. దీంతో స్పీకర్‌ ఆయనను మరోసారి హెచ్చరించారు. అయినప్పటికీ కూడా ఆయన వైఖరి మారలేదు.

అసెంబ్లీలో చంద్రబాబు సీటెక్కి..విజిల్‌ వేస్తూ అసెంబ్లీ గౌరవ మర్యాదలకు భంగం కలిగించారు. చంద్రబాబు అరెస్ట్‌ పై జగన్ కు వ్యతిరేకంగా నినాదాలిచ్చారు. ఇదంతా ఇలా ఉంటే తమ ఆందోళన అంతా కూడా మీడియా తీయడం మొదలు పెట్టారు. దీంతో ఈ విషయం గురించి వైసీపీ సభ్యులు స్పీకర్‌ దృష్టికి తీసుకుని వెళ్లగా..ఆయన టీడీపీ సభ్యులు అచ్చెన్నాయుడు,బి. అశోక్‌ లను సభ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది.

అదే సమయంలో బాలకృష్ణ తో పాటు మరికొందరు టీడీపీ సభ్యులు విజిల్ వేస్తూ నిరసనకు దిగారు. బాలకృష్ణ స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి విజిల్‌ ఊదుతూ హంగామా సృష్టించారు. టీడీపీ సభ్యులు ఆందోళన చేస్తుంటే వైసీపీ మంత్రులు కాకాని, అంబటి రాంబాబు వారి మీద మండిపడ్డారు. దీంతో సభ గందరగోళం గా మారడంతో శుక్రవారం సభ మరోసారి వాయిదా పడింది.

దీంతో ఈ సెషన్‌ మొత్తం కూడా అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలకు వెళ్లకూడదని టీడీపీ నిర్ణయించినట్లు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు