East Godavari: చంద్రబాబు అరెస్ట్‌పై కొనసాగుతున్న నిరసనలు

ఏపీలో చంద్రబాబు అరెస్ట్‌తో రాష్ట్రం వ్యాప్తంగా నిరసలు కొనసాగుతున్నాయి. చంద్రబాబు అరెస్ట్‌తో సీఎం జగన్‌ ప్రభుత్వ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. చంద్రబాబును విడుదల చేయాలని వారు డిమాంచ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ప్రజలని హెచ్చరిస్తున్నారు. కాకినాడ జిల్లాలోని పలు ప్రాంతాల్లో144 సెక్షన్ అమలు చేశారు.

New Update
East Godavari: చంద్రబాబు అరెస్ట్‌పై కొనసాగుతున్న నిరసనలు

జిల్లా వ్యాప్తంగా నిరసనలు

చంద్రబాబు అరెస్ట్‌పై ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ కార్యాలయాల వద్ద, టీడీపీ నాయకుల ఇంటివద్ద నల్లని బ్యాజీలు, వస్త్రాలతో దీక్షలు చేస్తున్నారు. డాక్టర్‌ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో టీడీపీ ఇంచార్జ్ ఆనందరావు ఆధ్వర్యంలో నిరసన చేస్తున్నారు. మండపేట కొలువ పువ్వు సెంటర్‌లో ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు.

విడుదల చేయాలని డిమాండ్

తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి నిరసన దీక్ష చెపట్టారు. తన నివాసం వద్ద నాయకులు కార్యకర్తలతో నలుపు రంగు దుస్తులు ధరించి రామకృష్ణారెడ్డి నిరసన చేపట్టారు. కాకినాడ సీటిమాజీ ఎమ్మెల్యే కొండబాబు ఆధ్వర్యంలో సామూహిక నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్ విగ్రహం దగ్గర నుంచి పార్టీ ఆఫీస్‌కి ర్యాలీ చేస్తూ చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాకినాడ రూరల్ నియోజవర్గం టీడీపీ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చెపట్టారు. కాకినాడ జిల్లా తునిలో టీడీపీ నాయకులు యనమల కృష్ణడు నిరసన దీక్ష చేస్తున్నారు. తన నివాసం వద్ద నాయకులు కార్యకర్తలతో నలుపు రంగు దుస్తులు ధరించి కృష్ణడు నిరసన చేస్తున్నారు.

నల్ల బ్యాజీలతో నిరాహారదీక్ష

తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో శాంతి భద్రతల నేపథ్యంలో రాజానగరం, కోరుకొండ, సీతానగరం, గోకవరం మండలాల్లో అధికారులు144 సెక్షన్ అమలు చేశారు. ముగ్గురు మించి గుమికూడకుండా ఉండాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. చర్యలు ఉల్లంఘన చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గ టీడీపి శ్రేణులు సామూహిక రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. మోకాళ్ళపై కూర్చుని జగన్‌కి వ్యతరేకంగా నినాదాలు చేశారు. పిఠాపురం మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పాత టీడీపీ కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే వర్మ నల్ల బ్యాజీలతో నిరాహారదీక్ష చేస్తున్నారు. అల్లూరి జిల్లా రంపచోడవరంలో టీడీపీని నియోజకవర్గ ఇన్చార్జ్ వంతల రాజేశ్వరి ఆధ్వర్యంలో వందమంది టీడీపీ శ్రేణులతో రిలేనిరాహార దీక్షలు చేస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు