Kuppam: కుప్పంలో కొనసాగుతున్న బంద్..బస్టాండ్‌కే పరిమితమైన ఆర్టీసీ బస్సులు

చిత్తూరు జిల్లా కుప్పం టీడీనీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా బంద్‌కు తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది. మరోవైపు కుప్పంలో బంద్ కొనసాగుతోంది. దుకాణాలు మూతపడ్డాయి, మరోవైపు బస్టాండ్‌కే ఆర్టీసీ బస్సులు పరిమిత మయ్యాయి.

New Update
Kuppam: కుప్పంలో కొనసాగుతున్న బంద్..బస్టాండ్‌కే పరిమితమైన ఆర్టీసీ బస్సులు

చిత్తూరు జిల్లా కుప్పం టీడీనీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా బంద్‌కు తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది. మరోవైపు కుప్పంలో బంద్ కొనసాగుతోంది. దుకాణాలు మూతపడ్డాయి, మరోవైపు బస్టాండ్‌కే ఆర్టీసీ బస్సులు పరిమిత మయ్యాయి. కొంతమంది నేతలను ముందస్తు చర్యగా ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకుండా ఉండేందుకు ముందస్తు చర్యగా అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. కుప్పం టీడీపీ కార్యాలయం వద్ద కుప్పం పలమనేరు జాతీయ రహదారిపై రాళ్లు అడ్డంగా వేసి తెలుగు తమ్ముళ్లు నిరసన తెలిపారు. జాతీయ రహదారిపై అడ్డంగా ఉన్న రాళ్లను పూర్తిగా స్వయంగా పోలీసులే తొలగించి రాకపోకలకు అంతరాయం లేకుండా పోలీసులు చేస్తున్నారు.

44 సెక్షన్ అమలు

కర్నూలు జిల్లాలో చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రాష్ట్ర బందుకు పిలిపునిచ్చిన టీడీపీ జనసేన మద్దత్తు తెలిపింది. ఆదోని టీడీపీ ఇంచార్జ్ మీనాక్షి నాయుడు హౌస్ అరెస్ట్ చేశారు పోలీసలు. అంతేకాకుండా టౌన్‌లో 144 సెక్షన్ అమలు చేశారు. రోడ్డుపై నిరసన తెలుపుతున్న టీడీపీ నాయకులను స్టేషన్ తరలించారు పోలీసులు. పోలీస్ జులం నశించాలని మాజీ టీడీపీ ఇంచార్జ్ గుడిసె కృష్ణమ్మ రోడ్డుపై బైఠాయించారు. పోలీసుల సహకారంతో యధావిధిగా RTC అధికారులు బస్సులు నడుపుతున్నారు. తిరుపతిలో జనసేన నాయకుల అరెస్ట్ అయ్యారు. జనసేన నేత కిరణ్ రాయల్, రాజారెడ్డి, బాబ్జీ మరియు ముఖ్య నాయకులును టీడీపీ బంద్‌కు జనసేన మద్దతు ఇచ్చిన కారణంతో రాత్రి నుంచే హౌస్ అరెస్టులు చేశారు.

ఉద్రిక్తత

విజయవాడ బస్టాండ్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. చంద్రబాబు రిమాండ్ నేపథ్యంలో నిరసనకు పిలుపునిచ్చారు టీడీపీ నేతలు. నిరసన తెలిపేందుకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, గద్దె రామ్మోహన్‌ను అరెస్ట్ చేసే క్రమంలో ఉద్రిక్తత దారి తీసింది. టీడీపీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. టీడీపీ నేతలతో పాటు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రశాంతంగా కొనసాగుతున్న బంద్ 

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ప్రశాంతంగా బంద్ కొనసాగుతోంది. యధావిధిగా ఆర్టీసీ బస్సులు తిరుగుతున్నాయి. పట్టణంలో ర్యాలీ నిర్వహిస్తూ దుకాణాలు మూయించి వేస్తున్నారు టీడీపీ శ్రేణులు. బంద్‌కు  ప్రజలు సహకరించాలని కోరుతున్న నేతలు.

Advertisment
Advertisment
తాజా కథనాలు