గాడ్ గిఫ్ట్.. ! కొడుకు గురించి ఇంట్రెస్టింగ్ మ్యాటర్ చెప్పిన కమెడియన్..!! కమెడియన్ సుధాకర్ కొన్ని వందలాది చిత్రాల్లో అటు హీరోగా, ఇటు కమెడియన్‌గా రాణించి మంచి గుర్తింపు పొందారు. ఆడియెన్స్‌కి హాస్యాన్ని పంచుతూ టాలీవుడ్లో తనకంటూ చెరగని ముద్ర వేసుకున్నారు. ఆ తరువాత అనారోగ్యానికి గురై నటనకు దూరమయ్యారు. తాజాగా తన కొడుకు గురించి సుధాకర్ ఓ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. By Shareef Pasha 23 Jun 2023 in సినిమా Scrolling New Update షేర్ చేయండి ప్రముఖ కమెడియన్, నటుడు సుధాకర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో హీరోగా నటించి ఓ వెలుగు వెలిగిన నటుడు సుధాకర్. తన యాక్టింగ్, కామెడీతో ఆడియెన్స్ గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. హీరోగా చేసిన అనంతరం కమెడియన్ గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. వందలాది చిత్రాల్లో నటించిన ఆయన సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇలా సాగుతున్న క్రమంలో అనారోగ్యానికి గురై ఇంటికే పరిమితమ్యారు సుధాకర్. ఇటీవల ఓ ఛానల్ లో ప్రసారమైన ప్రొగ్రాంలో పాల్గొని అప్పటి రోజులను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. అనారోగ్యం కారణంగా సుధాకర్ నటనకు దూరం: బండ్లు ఓడలు.. ఓడలు బండ్లు అవుతాయంటే ఇదేనేమో కాబోలు. ఒకప్పుడు స్టార్ యాక్టర్‌గా రాణించి మెప్పించిన సుధాకర్ అనారోగ్యం పాలై నటనకు దూరమయ్యారు. జీవితం అన్నాక ఒడిదుడుకులు ఉంటాయి. వాటిని దాటుకుని ముందుకు సాగితేనే విజయం వరిస్తుంది. అలా చాలామంది నటీనటులు కెరీర్లో ఓటమి చవిచూసినా మళ్లీ ప్రయత్నించి గెలిచి నిలిచిన సందర్భాలు చాలానే ఉన్నాయి. నటుడు సుధాకర్ విషయంలోనూ అలాగే జరిగింది. స్టార్టింగ్ హీరోగా ఓ వెలుగు వెలిగిన ఆయన తరువాత కమెడియన్ గా దూసుకుపోయారు. అయితే ఈ మధ్య ఓ ప్రొగ్రాంలో పాల్గొన్న ఆయన తన కొడుకు గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు. హీరోగా, కమెడియన్‌గా,నిర్మాతగా రాణించిన సుధాకర్: నటుడు సుధాకర్ నిర్మాతగా, హీరోగా, కమెడియన్ గా పనిచేశారు. ఆయన తన కొడుకు గురించి చెప్తూ.. నటుడు సుధాకర్ కు పెళ్లైన చాలా ఏళ్ల వరకు సంతానం కలగలేదని చెప్పారు. సంతానం కోసం చేయని ప్రయత్నం లేదని తెలిపారు. ఒకానొక సందర్భంలో మద్రాస్‌లో ప్రముఖ చర్చిలో ప్రార్థనలు చేయగా సంతానం అందిందని తెలిపారు. ఆ అద్బుతంతోనే జీసస్ కు కృతజ్ఞతగా తన కొడుకుకు (బెన్ని) బెనెడిక్ మైఖేల్ అని పేరు పెట్టామని తెలిపారు. బెన్ని గాడ్ గిఫ్ట్ సన్ అని, తను పుట్టిన తరువాత అన్ని విధాల కలిసొచ్చిందని వెల్లడించారు. కొడుకు పుట్టిన తరువాత క్రైస్తవ మతంలోకి మారినట్లుగా తెలిపారు. ఇక ఈ మధ్యే బెన్నీ చదువు పూర్తి చేసుకుని సినిమా రంగంలోకి రావాలని ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. చిరంజీవి నాకు మంచి మిత్రుడని.. తన కొడుకు బాధ్యతను చిరంజీవి గారే దగ్గరుండి తీసుకుని ఇండస్ట్రీకి పరిచయం చేస్తారని చెప్పుకొచ్చారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి