Colors Swathi : త్వరలో విడాకులు తీసుకోబోతున్న హీరోయిన్ కలర్‌ స్వాతి?..

తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు తనది ఆమెనే.. కలర్స్ స్వాతి. టీవీ షోస్ చేస్తూ తనకంటూ ప్రత్యేక ఐడెంటీటీని సంపాదించుకుంది. ఆ తర్వాత వరుసగా సినిమా ఛాన్సులు రావడంతో కథానాయికగా బిజీ అయిపోయింది. అయితే తాజాగా స్వాతి గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటంటే, ఆమె కొద్ది రోజుల నుంచి తన భర్త వికాస్‌‌కు దూరంగా ఉంటుందట. భర్త ఫోటోలని తన ఇన్‌‌స్టాగ్రామ్ నుంచి తొలగించడమే దానికి ప్రధాన కరాణమంటున్నారు.

New Update
Colors Swathi : త్వరలో విడాకులు తీసుకోబోతున్న హీరోయిన్ కలర్‌ స్వాతి?..

న్యాచురల్ స్టార్‌ నాని పక్కన ‘అష్టాచమ్మా’ మూవీలో నటించింది. ఈ సినిమాకు నంది అవార్డు వరించింది. ‘స్వామిరారా’,‘కార్తికేయ’వంటి సూపర్ హిట్ చిత్రాలతో మాంచి ఫ్యాన్స్‌ ఫాలోయింగ్‌ని సంపాదించుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది. కొంత గ్యాప్ అనంతరం ముఖానికి మళ్లీ మేకప్ వేసుకుంది. ఇటువంటి కారణాలకు సంబంధించి గతంలో కొన్ని సంఘటనలు జరిగాయి. సమంత, నాగ చైతన్యతో విడిపోతునట్లు అనుమానం వచ్చేలా తన పేరు ముందు అక్కినేనితో పాటు, ఇన్‌స్టా నుంచి వారిద్దరున్న ఫోటోస్‌‌ తీసేసింది. ఆ తర్వాత కొన్ని రోజులకి వాళ్లిదరు విడాకులు తీసుకున్నారు.

View this post on Instagram

A post shared by Swathi (@swati194)

యూట్యూబ్ ఛానెల్స్‌‌తో పాటు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం

ఈ మధ్య విడాకులు తీసుకున్న నిహారిక, చైతన్య జొన్నలగడ్డ విషయంలో కూడా ఇదే జరిగింది. తాజాగా కలర్స్ స్వాతి తన భర్త ఫోటోలు డిలీట్ చేయడంతో.. ఈ జంట కూడా విడిపోతుందని పలు యూట్యూబ్ ఛానెల్స్‌‌తో పాటు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. రెండు సంవత్సరాల క్రితం కూడా స్వాతి విడాకులు తీసుకున్నట్లు ఇలాగే వార్తలు వైరల్ అయ్యాయి. ఇన్‌‌స్టాగ్రామ్‌‌లో తన భర్త ఫోటోలు ఎందుకు లేవో అప్పట్లోనే క్లారిటీ ఇచ్చింది.

కలర్స్ స్వాతి తన భర్త నిజంగానే విడిపోతున్నారా..?

భర్తతో కలిసి దిగిన ఫోటోలను ఆర్కైవ్‌‌‌లో దాచుకున్నానంటూ తన ఫోన్‌లో ఉన్న పిక్స్ చూపించింది. ఫోటోలన్ని కలిపి ఒక వీడియో కూడా చేసింది. దాని తర్వాత విడాకుల పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది. కానీ మళ్లీ స్వాతి విషయంలో ఇదే ప్రచారం జరుగుతుంది. 2018లో మలయాళం కుటుంబానికి చెందిన పైలెట్ వికాస్ వాసును స్వాతి ప్రేమించి పెళ్లి చేసుకుంది. తర్వాత వీరిద్దరు థాయిలాండ్‌‌లో సెటిల్ అయ్యారు. అప్పట్లో సినిమాలకు గ్యాప్ ఇచ్చి మళ్లీ 2019లో మళయాలం, తెలుగులోనూ నటించింది. ఇప్పుడు వీరిద్దరు విడిపోతున్న ప్రచారానికి సంబంధించి వస్తున్న వార్తల్లో వాస్తవమేంటనేది స్వాతి చెప్తే కానీ తెలియదు.

Advertisment
Advertisment
తాజా కథనాలు