వైఎస్సార్‌ జయంతి సందర్భంగా సీఎం జగన్ ఎమోషనల్ ట్వీట్

నేడు ఉమ్మడి ఏపీ మాజీ సీఎం దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 74వ జయంతి సందర్భంగా కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద విజయమ్మ, షర్మిల నివాళులర్పించారు. వైఎస్ఆర్ ఘాట్ వద్ద షర్మిల ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ తన తండ్రి వైఎస్సార్‌ను గుర్తు చేసుకుంటూ తన ట్విట్టర్‌ ఖాతాలో భావోద్వేగ ట్వీట్ చేశారు.

New Update
వైఎస్సార్‌ జయంతి సందర్భంగా సీఎం జగన్ ఎమోషనల్ ట్వీట్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి అనే పదం వినగానే తన పెదవిపై చెరగని స్వచ్ఛమైన చిరునవ్వు మన కళ్ల ముందు ఇప్పటికి సాక్షాత్కరిస్తుంది. నమస్తే అక్కయ్యా.. నమస్తే చెల్లెమ్మా.. నమస్తే తమ్ముడూ.. అంటూ ఆప్యాయంగా పిలిచే పిలుపు మన చెవుల్లో ఇప్పటికి, ఎప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. ప్రజల సంక్షేమం, రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఒక అడుగు వేసి ఉమ్మడి రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించారు.

వైఎస్సార్‌ జయంతి సందర్భంగా సీఎం జగన్‌ భావోద్వేగ ట్వీట్‌

వైఎస్సార్‌ జయంతి సందర్భంగా ఆయనను గుర్తుచేసుకుంటూ ఆయన తనయుడు సీఎం జగన్‌ భావోద్వేగ ట్వీట్‌ చేశారు. ‘‘ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలని, ప్రతి ఇంట్లో గొప్ప చదువులు చదవాలని, సుఖసంతోషాలతో ప్రతి ఒక్కరూ ఉండాలని మీరు నిరంతరం తపించారు నాన్నా. అదే ప్రజలందరి హృదయాల్లో మీ స్థానాన్ని సుస్థిరం చేసింది. ఆ ఆశయాల సాధనలో మీ స్ఫూర్తి నన్ను ప్రతిక్షణం చేయిపట్టి నడిపిస్తోంది. మీ జయంతి మాకందరికీ ఒక పండుగ రోజు’’అని సీఎం తన ట్విటర్‌ ఖాతాలో పేర్కొన్నారు.

మీ స్ఫూర్తి నన్ను ప్రతిక్షణం నా చేయిపట్టి

ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలని, ప్రతి ఇంట్లో గొప్ప చదువులు చదవాలని, సుఖసంతోషాలతో ప్రతి ఒక్కరూ ఉండాలని మీరు నిరంతరం తపించారు నాన్నా. అదే ప్రజలందరి హృదయాల్లో మీ స్థానాన్ని సుస్థిరం చేసింది. ఆ ఆశయాల సాధనలో మీ స్ఫూర్తి నన్ను ప్రతిక్షణం చేయిపట్టి నడిపిస్తోంది. మీ జయంతి మాకందరికీ ఒక చెరగని జ్ఞాపకం అంటూ ఎమోషనల్‌ ట్వీట్ చేశారు. తన బాటలోనే నడుస్తూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తానని తెలిపారు. తన తండ్రి తనకు రాజకీయ పాఠాలు నేర్పాడని తన చేయి పట్టుకొని తన అడుగుజాడల్లో నడిచానని గత స్మృతులను గుర్తుచేసుకున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు