Marimuthu: జైలర్ నటుడు కన్నుమూత..సెలబ్రెటీల సంతాపం

ఈ మధ్య కాలంలో సినీ పరిశ్రమల్లోనూ విషాదకర సంఘటనలు జరుగుతున్నాయి. ఎంతో మంది పెద్ద పెద్ద నటులు, టెక్నీషియన్లు, డైరెక్టర్లు, నిర్మాతలు హార్ట్‌ సమస్యతో కన్నుమూస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ తమిళ నటుడు జి. మారిముత్తు గుండెపోటుతో కన్నుమూశారు. తాజాగా విక్రమ్‌, జైలర్‌ సినిమాలలోనూ కీలక పాత్రలు పోషించారు.

New Update
Marimuthu: జైలర్ నటుడు కన్నుమూత..సెలబ్రెటీల సంతాపం

Jailer Actor G Marimuthi Passes Away

మారిముత్తు ఇకలేరు

తమిళ నటుడు, డైరెక్టర్‌ G. మారిముత్తు (57) శుక్రవారం ఉదయం మరణించాడు. నేడు తెల్లవారుజామున మారిముత్తుకు గుండెపోటుకు గురయ్యారు. దీంతో దగ్గరలోని ఆస్పత్రికి కటుంబ సభ్యులు ఆయనను తరలించారు. చికిత్స పొందుతుండగానే మారిముత్తు మృతి చెందాడు. ఆయన మరణంతో తమిళ ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్‌కు గురైంది.

ప్రముఖుల సంతాపం

నటుడు మారిముత్తు మృతి పట్ల సెలబ్రెటీలు, పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. మారి ముత్తు రెండు దశాబ్దాలుగా తమిళ ఇండస్ట్రీలో బిజీయెస్ట్‌ నటుడిగా ఉన్నారు.100కు పైగా సినిమాల్లో ఆయన నటించాడు. కేవలం నటుడుగానే కాకుండా రెండు సినిమాలకు దర్శకత్వం కూడా మారిముత్తు వహించాడు. అంతేకాదు తెలుగు ప్రేక్షకులకు కూడా మారి ముత్తు సుపరిచితమే. ముత్తు తెలుగులో నటించకపోయినా తమిళ డబ్బింగ్‌ సినిమాలతో ఇక్కడి ప్రేక్షకులను పలకరించాడు. పందెం కోడి-2, చినబాబు, సుల్తాన్‌, డాక్టర్‌ వంటి మూవీల్లో కీలకపాత్రలు పోషించాడు.

నటుడిగా బిజీ

నెగెటీవ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రల్లోనే ముత్తు ఎక్కువగా కనిపించేవారు. రీసెంట్‌గా రిలీజైన జైలర్‌ సినిమాలో విలన్‌కు నమ్మకస్తుడిగా కీలకపాత్ర చేశాడు. ఇండియన్‌-2లోనూ ముత్తు నటించాడు. పలు తమిళ సీరియల్స్‌లోనూ ముత్తు నటించాడు. ఇతను 2008లో హీరోయిన్‌ స్నేహ భర్త ప్రసన్నను హీరోగా పెట్టి కన్నుమ్ కన్నుమ్ అనే సినిమా మారి ముత్తు తెరకెక్కించాడు. ఈ మూవీ కమర్షియల్‌గా పెద్దగా ఆడలేదు కానీ మారి ముత్తుకు డైరెక్టర్‌గా మంచి పేరు వచ్చింది. మళ్లీ ఆరేళ్లకు పులివల్‌ అనే థ్రిల్లర్‌ సినిమా అట్టర్‌ ప్లాప్‌గా అయింది. ఆ తర్వత ఆయన నటుడిగా బిజీ అయ్యారు.

Also Read: మూడు రోజులు మృత్యువుతో పోరాడి ఓడిన రవీందర్‌!

Advertisment
Advertisment
తాజా కథనాలు