/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Telugu-brothers-burning-TDP-flags-in-Guntakal-jpg.webp)
AP Politics: అనంతపురం జిల్లా గుంతకల్‌లో టీడీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ అభ్యర్థి గుమ్మనూరు జయరాం ప్రకటన రావడంతో మాజీ ఎమ్మెల్యే జితేందర్ గౌడ్ అనుచరులు పార్టీ కార్యాలయానికి చేరుకొని పార్టీ కార్యాలయంలోని కుర్చీలు జెండాలు పార్టీ సంబంధించిన పత్రాలను కింద వేసి పెట్రోల్ వేసి తగలబెట్టారు. పార్టీ కోసం కష్టపడిన జితేందర్ గౌడ్ కాకుండా ఇతర జిల్లా నుంచి వచ్చిన వైసీపీ మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంకి టీడీపీలోకి చేరగానే పార్టీ టికెట్‌ను కట్టబెట్టడంపై మండిపడుతూ చంద్రబాబుపై మాటల్లో చెప్పలేని దూషణలు దిగారు.పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఇది కూడా చదవండి: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు.. కాంగ్రెస్‌పై కిషన్‌రెడ్డి ఫైర్!
ముందుగా మాజీ ఎమ్మెల్యే జితేందర్ గౌడ్ క్యాంపు కార్యాలయం నుంచి పార్టీ కార్యకర్తలు నాయకులు ఆవేశంతో పార్టీ జెండాలను, చంద్రబాబు చేసిన పథకాల గురించి తయారు చేసిన జాబితాలను కింద వేసి పెట్రోల్ పోసి నిప్పంటించారు. అక్కడ నుంచి పార్టీ కార్యాలయం చేరుకొని ప్రధాన రహదారిపై బీభత్సం సృష్టించారు.
ఇది కూడా చదవండి: ఉపాధ్యాయుల బదిలీల్లో కోట్ల రూపాయల కుంభకోణం.. నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు