కొడాలి నానికి క్యాన్సర్ అంటూ వార్తలు.. ఆందోళనలో ఫ్యాన్స్ ఏపీ మాజీ మంత్రి కొడాలి నానికి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఆయన క్యాన్సర్‌తో బాధపడుతున్నారని ఆయన పరిస్ధితి బాగాలేదంటూ సోషల్‌మీడియాలో విపరీతంగా ప్రచారం సాగుతోంది. అయితే ఈ వార్త విన్న కొడాలి నాని ఫ్యాన్స్ ఆందోళనకు గురవుతున్నారు. అంతేకాదు అసలు కొడాలి నానికి ఏం అయ్యిందంటూ ఎమోషనల్ అవుతున్నారు. By Shareef Pasha 11 Jul 2023 in ఆంధ్రప్రదేశ్ Scrolling New Update షేర్ చేయండి మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అనారోగ్యానికి గురయ్యారని ప్రముఖ మీడియాలో వరుస కథనాలను రాసుకొచ్చింది. ఆయన అనారోగ్యానికి ముఖ్య కారణం క్యాన్సర్ అంటూ టెలీకాస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు వార్తలు వచ్చాయి. కొడాలి నాని తన అనారోగ్య కారణాల దృష్ట్యా రాజకీయాలకు స్వస్తి చెప్పనున్నారని అంటున్నారు. కొడాలి నాని తర్వాత ఆయన తమ్ముడి కొడుకు రాజకీయాల్లోకి వస్తున్నారని సదరు మీడియా రాసుకొచ్చింది. అయితే గతంలో కూడా కొడాలి నాని ఆరోగ్యంపై అనేక ప్రచారం జోరుగా జరిగాయి. సోషల్ మీడియాలో నానిపై వార్తలు మెరుగైన ఆరోగ్యం కోసం హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందినట్లు ఆ మధ్య సోషల్ మీడియాలో పలురకాల వార్తలు బయటకు వచ్చాయి. అయితే అప్పట్లో కొడాలి నాని లేజర్ ట్రీట్మెంట్ చేయించుకున్నారని ప్రచారం జరిగింది. గత ఏడాది గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో కొడాలి నాని పాల్గొన్నారు. ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత అదే రోజు రాత్రి హైదరాబాద్‌కు వెళ్లారు. తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతున్నారని, అపోలో ఆస్పత్రిలో చేర్పించి అన్ని వైద్య పరీక్షలు చేయించుకున్నారని, కిడ్నీలో రాళ్లు ఉన్నాయని, లేజర్ చికిత్సతో రాళ్లను కరిగించుకునే ట్రీట్మెంట్ తీసుకున్నారని ప్రచారం జరిగింది. కొడాలి నానికి క్యాన్సర్ అంటూ మళ్లీ ప్రచారం అయితే తాజాగా ఆయనకు క్యాన్సర్ అంటూ మళ్లీ ప్రచారం జరుగుతుంది. ప్రముఖ మీడియా కథనం రాయడంతో కొడాలి నాని అభిమానులు నిజమేననుకొని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మా నాయకుడు బాగుండాలని ప్రార్థనలు చేస్తున్నారు. అంతేకాదు ఇదంతా లేనిపోని రూమర్స్‌ను క్రియేట్ చేస్తున్నారంటూ మరికొందరు అభిమానులు ఈ వార్తలను కొట్టి పారేస్తున్నారు. ఏదేమైనా కొడాలి నాని స్వయంగా స్పందించనంత వరకు అసలు విషయం ఏంటనేది బయటకు వస్తుంది. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి