/rtv/media/media_files/gSbP6ihhSJFEjS5TRuEn.jpg)
cement
Iran-America War: పశ్చిమాసియాలో యుద్ధం ఉ పేద, మధ్య తరగతి జీవితాలపై పెను ప్రభావం చూపుతోంది. నిన్న మొన్నటి వరకు గ్కాస్, పెట్రోల్ పై ప్రభావం చూపిన యుద్ధం ఇపుడు సిమెంట్ కంపెనీలపైనా పడింది. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో50 కిలోల సిమెంట్ బస్తా ధర త్వరలోనే రూ.50 వరకు పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి, మరో వారం రోజుల్లో ఈ పెంపు ఉండవచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయమై ఇప్పటికే కంపెనీలు, ప్రధాన డీలర్ల నుంచి సంకేతాలు అందినట్లు రిటైల్ డీలర్లు స్పష్టం చేస్తున్నారు.
ధరలు పెరుగుతాయన్న అంచనాతో హోల్ సేల్ వ్యాపారులు రిటైల్ వ్యాపారులకు సిమెంట్ సరఫరాను నిలిపివేశారు. ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో డిటైల్ మార్కెట్లో బస్తా సిమెంట్ ధర ఆయా కంపెనీలను బట్టి రూ.280 నుంచి రూ.320 వరకు ఉండగా ఇది ధరల పెంపు తర్వాత రూ.320 నుంచి రూ.370 వరకు చేరుకునే అవకాశం ఉంది.
సిమెంట్ తయారీ పరిశ్రమల్లో సిమెంట్ తయారు చేయాలంటే అనేక ఖర్చులు ఉంటాయి. అందులో 30 శాతం విద్యుత్, ఇంధనాలకు ఖర్చవుతుంది. దేశంలో ఉన్న ప్రధాన సిమెంట్ కంపెనీలన్నీ తమ ఇంధన అవసరాల్లో 50 నుంచి 60 శాతం దిగుమతి చేసుకునే పెట్రోలియం కోక్ ద్వారా తీర్చుకుంటాయి. అయితే ఈ పెట్ కోక్ ధర యుద్ధానికి ముందు టన్ను 125 నుంచి 130 డాలర్లు (అంటే సుమారు రూ12,285)మధ్య ఉండేది.ఇపుడు దాని ధర 160 నుంచి 165 డాలర్లకు (సుమారు రూ.15,120 నుంచి 15,592) చేరుకోవడం గమనార్హం. ఇదిలా ఉండగానే లీటర్ ఇండస్ట్రీయల్ డీజిల్ ధరను కేంద్ర ప్రభుత్వం రూ,2375 కు పెంచింది. దీనితో పాటు సిమెంట్ ప్యాకింగ్ కు ఉపయోగించే పాలీప్రోప్లైన్ వోవెన్ ఫ్యాబ్రిక్ ధరలు 85 శాతం పెరిగాయి. ఈ ధరల భారాన్నీ తట్టుకోవాలంటే ధరలు పెంచడం తప్ప మరో మార్గం లేదని ఆయా కంపెనీల యజమాన్యాలు అంటున్నాయి. అదే సమయంలో డీజిల్ ధరలు కూడా పెరిగితే రవాణా ఖర్చులు పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు ఆందోలన వ్యక్తం చేస్తున్నారు,2925--26 మార్చితో ముగిసే ఈ ఆర్థిక సంవత్సరం సిమెంట్ కంపెనీలకు బాగుంటుందని తెలుస్తోంది, రెండు రాష్ర్టా్ల్లో రికార్డు స్థాయిలో అమ్మకాలు జరుగుతాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇది సుమారు 38 లక్షల టన్నుల నుంచి 40 లక్షల టన్నుల వరకు ఉంటుందని అంచనా,
మరోవైపు నిర్మాణాల్లో కీలకమైన ఇనుము ధరలు రోజు రోజుకూ పెరిగిపోతుంది. 20 రోజుల కిందటి ధరలతో పోల్చితే భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. యుద్ధం ప్రారంభంలో టన్ను ఇనుము ధర రూ.65వేలు ఉండగా ప్రస్తుతం రూ.75వేల నుంచి రూ.78వేల వరకు పెరిగింది. వీటితో పాటు ఇంటి నిర్మాణంలో వినియోగించే టైల్స్, మార్బుల్స్ ధరలకు రెక్కలొచ్చాయి. నిర్మాణాలకు వినియోగించే అన్నిరకాల టైల్స్ ఇతర ప్రాంతాల నుంచే జిల్లాకు దిగుమతి అవుతున్నాయి. గ్యాస్ కొరత కారణంగా అక్కడ కొన్ని పరిశ్రమలు మూసి వేయడంతో సమస్య ఏర్పడిందని వ్యాపారులు చెబుతున్నారు.
Follow Us