BRS MLA: కౌశిక్ రెడ్డికి బిగ్ షాక్..రీల్స్‌పై కేసు నమోదు!

బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. యాదాద్రి ఆలయంలో భార్య, కూతురితో రీల్స్ చేసి హిందువుల మనోభావాలు దెబ్బతీశారంటూ VHP నేత సుభాష్ చంద్ర ఇచ్చిన ఫిర్యాదుతో పటాన్‌చేరు పోలీసులు కేసు నమోదు చేశారు.

author-image
By srinivas
New Update
dsee wbse

Kaushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. యాదాద్రి ఆలయంలో భార్య, కూతురితో రీల్స్ చేసి తీవ్ర విమర్శలప పాలైన కౌశిక్ రెడ్డిపై VHP నేత సుభాష్ చంద్ర కౌశిక్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. దీంతో పటాన్‌చేరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు యాదాద్రి ఆలయంలో రీల్స్ చేసి హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించారంటూ సుభాష్ ఇచ్చిన కంప్లైంట్ తో కేసు ఫైల్ చేసినట్లు పోలీసులు తెలిపారు.  

ఇది కూడా చదవండి: యాదాద్రి ఆలయంలో కౌశిక్‌రెడ్డి ఫొటోషూట్.. మండిపడుతున్న భక్తులు

అసలేం జరిగిందంటే..


ఆదివారం కుటుంబం సమేతంగా యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామివారి దర్శనానికి వెళ్లిన కౌశిక్ రెడ్డి.. దర్శనం అనంతరం ఆలయ మాఢ వీధుల్లో ఫొటోషూట్‌, రీల్స్ చేశారు. ఆలయ మాఢ వీధుల్లో తన భార్య, కూతురితో కలిసి రీల్స్ చేస్తూ ఫొటోలకు ఫోజులిచ్చారు. అంతేకాదు వీటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. వైరల్ కావడంతో నెటిజన్లనుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్యేగా ఉండి ఆలయ ప్రతిష్ట దెబ్బతీసేలా వ్యవహరించారని కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం కౌశిక్ రెడ్డి రీల్స్ వైరల్ అవుతుండగా.. బీఆర్ఎస్ శ్రేణులు, అతని అభిమానులు ఫుల్ ఖుష్‌ అవుతూ పొగిడేస్తున్నారు. 

ఇది కూడా చదవండి: లేడీ అఘోరాకు బిగ్ షాక్.. అరెస్ట్ చేసిన పోలీసులు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

పాపం.. దోమల కాయిల్‌కు పసి బాలుడు బలి

రంగారెడ్డి జిల్లాలో దోమల కాయిల్‌కు నాలుగేళ్ల బాలుడు బలి అయ్యాడు. ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నాయని తల్లిదండ్రులు పరుపుకి దగ్గరగా కాయిల్ పెట్టారు. దీనికి కాయిల్ అంటుకోవడంతో దట్టమైన పొగలు వ్యాపించి ఊపిరాడక నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు.

New Update
MOSQUITO COIL

MOSQUITO COIL

రంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. దోమల కాయిల్‌కు నాలుగేళ్ల బాలుడు బలి అయ్యాడు. వివరాల్లోకి వెళ్తే హయత్ నగర్‌లో ఓ ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నాయని తల్లిదండ్రులు కాయిల్ వెలిగించారు. అది కూడా దూరంగా పెట్టకుండా పిల్లలు పడుకున్న పరుపుకి దగ్గరగానే పెట్టారు. ఆ కాయిల్ పిల్లల పరుపుకు అంటుకోవడంతో దట్టమైన పొగలు వ్యాపించాయి. ఆ నాలుగేళ్ల బాలుడు ఊపిరాడక మృతి చెందాడు. మరో ఐదేళ్ల బాలిక పరిస్థితి కూడా ప్రస్తుతం విషమంగా ఉంది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇది కూడా చూడండి: Pahalgam Terror Attack : పహల్గాం దాడిపై ఉగ్రవాద సంస్థ సంచలన ప్రకటన.. టీఆర్‌ఎఫ్‌ యూ టర్న్

అదుపు తప్పిన వ్యాన్..

ఇదిలా ఉండగా ఇటీవల హర్యానా ఫిరోజ్‌పూర్ జిర్కాలోని ఇబ్రహీం బాస్ గ్రామం సమీపంలో ఘోరం జరిగింది. రోడ్డు శుభ్రం చేస్తున్న పారిశుద్ధ్య  కార్మికులపైకి వ్యాన్‌ దూసుకెళ్లింది. ఢిల్లీ నుంచి అల్వార్ వైపు వేగంతో వెళ్తున్న పికప్ వ్యాన్ అదుపు తప్పింది. ఈ సంఘటనలో ఏడుగురు కార్మికులు మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు. రోడ్డు పక్కన చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలతో ఆ ప్రాంతం భయంకరంగా మారింది.

ఇది కూడా చూడండి: SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌కు మూడు నెలలు బ్రేక్‌!

యాక్సిడెంట్ తర్వాత వ్యాన్‌ డ్రైవర్‌ దిగి అక్కడి నుంచి పారిపోయాడు. దేశ రాజధాని ఢిల్లీ శివారులో ఈ దుర్ఘటన శనివారం ఉదయం 10 గంటలకు చోటుచేసుకుంది. ఢిల్లీ నుంచి ముంబై వెళ్లే ఎక్స్‌ప్రెస్‌వే మీద కొందరు పారిశుద్ధ్య కార్మికులు క్లీనింగ్‌ చేస్తున్నారు. ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయడిన కార్మికులను హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. 

ఇది కూడా చూడండి:Hyderabad: హైదరాబాద్‌లో పాకిస్తానీయులు.. పోలీసులు సంచలన నిర్ణయం

 

Advertisment
Advertisment
Advertisment