Municipal Elections : మున్సిపల్‌ ఎన్నికల్లో మహిళలదే జోరు. మగవారిని మించి పోటీ..

తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికల సందడి మొదలైంది. ఈ నెల 11న జరగనున్న ఏడు నగర పాలక సంస్థలు, 116 పురపాలక సంఘాల ఎన్నికల్లో మొత్తం 12,944 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పోటీదారుల్లో 6,508 మంది (50.27శాతం) మహిళలు ఉండగా, 6,436 (49.73 శాతం) మంది పురుషులున్నారు.  

New Update
FotoJet (17)

Women are the force in municipal elections

Telangana Municipal Elections  : తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికల సందడి మొదలైంది. ఈ నెల 11న జరగనున్న ఏడు నగర పాలక సంస్థలు, 116 పురపాలక సంఘాల ఎన్నికల్లో మొత్తం 12,944 (ఏకగ్రీవాలతో కలిపి) మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే  పురపాలక ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారిలో పురుష అభ్యర్థుల కంటే మహిళలే అధికంగా ఉండటం గమనార్హం. మొత్తం పోటీదారుల్లో 6,508 మంది (50.27శాతం) మహిళలు ఉండగా, 6,436 (49.73 శాతం) మంది పురుషులున్నారు.  

నగరపాలక సంస్థల్లో ఒకటైన  కరీంనగర్‌లో  మొత్తం 66 డివిజన్లు ఉండగా వీటిలో అత్యథికంగా 398 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. ఇక పురపాలిక సంస్థల్లో ఆదిలాబాద్‌లో అత్యధికంగా 49 వార్డులకు గాను 314 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. అత్యల్పంగా కొడంగల్‌ మున్సిపాలిటీలో 12 వార్డులకు 34 మంది మాత్రమే ఎన్నికల బరిలో నిలవడం గమనార్హం. అలాగే నగరపాలికలను పరిశీలిస్తే మహబూబ్‌నగర్‌లో అత్యధికంగా 127 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. పురపాలికల్లో ఆదిలాబాద్‌లో 93 మంది ఇండిపెండెంట్‌అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఈ మేరకు అభ్యర్థుల జాబితాను లంగాణ ఎన్నికల సంఘం విడుదల చేసింది.

రాష్ట్రవ్యాప్తంగా పార్టీల వారీగా పోటీ చేసే స్థానాల విషయానికి వస్తే 2,948 (98.3 శాతం) స్థానాల్లో అధికార కాంగ్రెస్​ పార్టీ పోటీచేస్తోంది. భారత రాష్ట్రసమితి​ 2,878 స్థానాల్లో (96 శాతం), బీజేపీ 2,634 (87.3 శాతం), ఇండిపెండెంట్ అభ్యర్థులు 2,786 (94 శాతం), జనసేన పార్టీ 332 స్థానాల్లో (11.1 శాతం), మజ్లిస్‌ 282 (9.4శాతం), ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ 288 (11.1శాతం), బీఎస్సీ 213 (7.1శాతం), సీపీఐ 168 (5.6 శాతం), సీపీఎం 108 ( 4.2శాతం), ఆప్‌ 38 (1.2 శాతం), ఐయూఎంఎల్‌ 9 (0.3శాతం) స్థానాలకు పోటీ చేస్తున్నట్లు తేలింది. ఏడు కార్పొరేషన్ల పరిధిలో 414 డివిజన్లు ఉండగా. వీటి పరిధిలో 2,225 మంది ఎన్నికల బరిలో ఉన్నారు. పురపాలికల వారీగా చూస్తే 116 పురపాలికల్లో 10,719 మంది పోటీ చేస్తున్నారు.

అభ్యర్థుల విద్యార్హతలు : నగర, పురపాలక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే వారి విద్యార్హతలు గమనిస్తే ఆసక్తికర విషయలు తెలుస్తున్నాయి. వారిలో చాలామంది నిరక్షరాస్యులు ఉండటం గమనార్హం. పోటీ చేస్తున్నవారిలో పోస్టు గ్రాడ్యుయేట్లు 775, గ్రాడ్యుయేట్స్‌ 2,903మంది, అండర్ గ్రాడ్యుయేట్లు 7,917మంది ఉండగా నిరక్షరాస్యులు1,291మంది ఉన్నారు.

Advertisment
తాజా కథనాలు