/rtv/media/media_files/2025/02/23/6zhkAoSNKZdoPLIvPiMk.webp)
MLC election
Wine Shops close : మందు బాబులకు బ్యాడ్ న్యూస్. ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు మద్యం దుకాణాలను మూసివేయనున్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. 25వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 27 సాయంత్రం 4 గంటల వరకు వైన్ షాపులు మూసి ఉండనున్నాయి. మద్యం దుకాణాలతో పాటు కల్లు దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లు కూడా బంద్ కానున్నాయి. పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా… అధికారులు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని సగానికిపైగా జిల్లాల్లో ఈ నిర్ణయం అమల్లో ఉండనుంది. హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో కూడా లిక్కర్ షాపులు క్లోజ్ కానున్నాయి.
ఇది కూడా చూడండి: Pope: పోప్ ఆరోగ్య పరిస్థితి విషమం.. ఏమీ చెప్పలేమంటూ అధికారుల ప్రకటన!
రాష్ట్రంలోని ఉమ్మడి మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ పట్టభద్రుల, టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అంతేకాకుండా ఉమ్మడి ఖమ్మం-వరంగల్- నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి కూడా ఎలక్షన్ జరగనుంది. దాదాపు ఎన్నికల ప్రచారం కూడా పూర్తి కావొచ్చింది. ఫిబ్రవరి 27వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఉమ్మడి ఏడు జిల్లాల్లో మద్యం దుకాణాలు మూతపడనున్నాయి.కల్లు కంపౌండ్‌లు, బార్ అండ్ రెస్టారెంట్లు కూడా క్లోజ్ అవుతాయి. ఇక రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్న కొన్ని గ్రామాల్లో కూడా ఈ నిర్ణయం అమల్లో ఉండనుంది. ఈ గ్రామాలు… ఆయా జిల్లాల పరిధిలో ఉన్నప్పటికీ కమిషనరేట్ పరిధి నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఇది కూడా చదవండి: New Ration Cards: కొత్త రేషన్ కార్డు దారులకు గుడ్ న్యూస్.. మంత్రి కీలక ప్రకటన!
వరంగల్ – ఖమ్మం – నల్లగొండ ఉపాధ్యాయ స్థానానికి, మెదక్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ – కరీంనగర్ ఉపాధ్యాయ స్థానానికి 27న ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. మెదక్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ – కరీంనగర్ పట్టభద్రుల స్థానానికి కూడా అదే రోజు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల పరిధిలో మద్యం దుకాణాలను మూసివేయనున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
Also Read: మవోలకు మరో దెబ్బ.. భారీ డంప్ స్వాధీనం.. పోలీసుల చేతికి కీలక సమాచారం!
ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో… కొల్లూరు, ఆర్సీ పురం పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు రోజుల పాటు లిక్కర్ షాపులు మూసివేస్తున్నట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఫిబ్రవరి 25వ తేదీన సాయంత్రం 4 గంటల నుంచి 27 సాయంత్రం 4 గంటల వరకు బంద్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ పోలీస్ స్టేషన్ల పరిధిలోని క్లబ్బులు, పబ్బులు, స్టార్ హోటల్స్‌ల్లో సైతం లిక్కర్ అమ్మకాలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించి… విరుద్ధంగా మద్యం విక్రయాలు, మద్యం సరఫరాకు పాల్పడితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇది కూడా చూడండి: Pope: పోప్ ఆరోగ్య పరిస్థితి విషమం.. ఏమీ చెప్పలేమంటూ అధికారుల ప్రకటన!
ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని కొన్ని పోలీస్ స్టేషన్లు రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా యాదాద్రి జిల్లా ఉంది. ఇక్కడ కూడా మద్యం షాపులు క్లోజ్…అవుతాయి. ఇక ఎన్నికలు జరిగే ఉమ్మడి 7 జిల్లాలకు సంబంధించి అక్కడి పోలీసులు ఆదేశాలు జారీ చేయనున్నారు.
ఇది కూడా చూడండి: పదిరోజులకే పెళ్లి పెటాకులు.. హనీమూన్లో గొడవ.. చివరికి బిగ్ ట్విస్ట్!