నాలుగు దశాబ్ధాల తర్వాత స్వస్థలానికి మల్లోజుల.. బంధువులు ఏం చేశారంటే?

గతేడాది లొంగిపోయిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు,  పొలిట్ బ్యూరో మెంబర్ అయిన మల్లోజుల వేణుగోపాల్ రావు ఆదివారం ఆయన స్వస్థలం పెద్దపల్లికి వచ్చారు. 44 ఏండ్లు మావోయిస్టు పార్టీలో పనిచేసిన ఆయన గతేడాది అక్టోబర్ లో మహారాష్ట్ర సీఎం సమక్షంలో లొంగిపోయారు.

New Update
FotoJet (7)

Mallojula : ఇటీవల లొంగిపోయిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు,  పొలిట్ బ్యూరో మెంబర్ అయిన మల్లోజుల వేణుగోపాల్ రావు ఆదివారం ఆయన స్వస్థలం పెద్దపల్లికి వచ్చారు. సుమారు నాలుగున్నర దశాబ్దాలుగా మావోయిస్టు పార్టీలో పనిచేసిన ఆయన గతేడాది అక్టోబర్ లో మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌ సమక్షంలో లొంగిపోయిన విష‌యం తెలిసిందే. అయితే ఆయన లొంగిపోయినప్పటికీ మహారాష్ట్రలోనే ఉండిపోయారు. అయితే వేణుగోపాల్‌ సోదరుడు అంజయ్య అనారోగ్యంతో బాధపడుతున్నాడని తెలుసుకున్న ఆయన తొలిసారి పెద్దపల్లిలోని సొంతింటి కి వచ్చాఠు.

FotoJet (8)

కాగా మల్లోజుల వేణుగోపాల్ రావు పెద్దపల్లికి వచ్చిన విషయం తెలుసుకున్న బంధుమిత్రులు ఆయనను చూడడానికి తరలివచ్చారు. కాగా 2011 నవంబర్ లో పశ్చిమ బెంగాల్ లో జరిగిన ఎదురుకాల్పుల్లో మల్లోజుల సోదరుడు మల్లోజుల కోటేశ్వరరావు మృతి చెందిన విషయం తెలిసింది. అన్నదమ్ములిద్దరూ మావోయిస్టుల్లో చేరి అంచెలంచెలుగా ఎదిగి కేంద్ర కమిటీ స్థాయికి చేరుకున్నారు. అయితే మావోయిస్టు  ఎన్‌ కౌంటర్లు ఎక్కడ జరిగిన మల్లోజుల అన్నదమ్ముల గురించే చర్చ సాగేది. అలాంటిది వేణుగోపాల్‌ లొంగుబాటుతో ఆయన కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సుదీర్ఘకాలం తర్వాత మల్లోజులను చూసి ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు ఆనందం వ్యక్తం చేశారు. ఆయనతో ఫోటోలు దిగారు. అయితే 2022లో మల్లోజుల వేణుగోపాల్ తల్లి మల్లోజుల మధురమ్మ (96) మరణించారు. ఆ సమయంలో కూడా తల్లి అంత్యక్రియలకు మల్లోజుల హాజరుకాలేదు. ఆ తర్వాత అమ్మా నన్ను మన్నించు అంటూ అజ్ఞాతం నుంచి ఆయన ఒక భావోద్వేగ లేఖను విడుదల చేశారు. ఇప్పుడు బహిరంగ జీవితంలోకి వచ్చిన నేపథ్యంలో సుదీర్ఘ విరామం తర్వాత తన స్వగ్రామానికి వచ్చి తన పాత స్మృతులు గుర్తు చేసుకున్నారు. కాగా మల్లోజుల వేణుగోపాల్‌ పర్యటన అంతా మహారాష్ట్ర పోలీసుల కనుసన్నల్లోనే జరిగినట్లు తెలుస్తోంది.  అయితే ఈ సందర్భంగా మల్లోజుల వేణుగోపాల్ రావు  మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు.

Advertisment
తాజా కథనాలు