పిడుగుపాటుకు ముగ్గురు మృతి.. ఎక్కడంటే.!
పిడుగు పాటుకు ముగ్గురు మృతి చెందిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. భారీ వర్షానికి కూలీలు చెట్ల కిందకు వెళ్లడంతో చెట్లపై పిడుగు పడింది. దీంతో కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు.
పిడుగు పాటుకు ముగ్గురు మృతి చెందిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. భారీ వర్షానికి కూలీలు చెట్ల కిందకు వెళ్లడంతో చెట్లపై పిడుగు పడింది. దీంతో కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు.
వల్మిడి గ్రామంలో ఘనంగా సీతారామచంద్రస్వామి విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు జరిగాయి. జనగామ జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గం చారిత్రక వల్మిడి గ్రామంలోని గుట్టపైన శ్రీ సీతారామచంద్రస్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో త్రిదండి చినజీయర్ స్వామి పాల్గొన్నారు.
ఎమ్మెల్యే ముత్తిరెడ్డి వర్గంపై ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అనుచరులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారట. అది ముత్తిరెడ్డికి మరింత కోపాన్ని తెప్పించింది. ఇంకేముంది.. ఆయన బహిరంగంగానే పల్లా పేరును ప్రకటిస్తూ అగ్గిమీదగుగ్గిలం అయ్యారు. పోలీసులకు ఫిర్యాదు చేయడాన్ని నిరసిస్తూ శనివారం ఆయన రోడ్డెక్కారు. జనగామ ఆర్టీసీ చౌరస్తాలో ధర్నాకు దిగారు.
ములుగు జిల్లా జగన్నాథపురం జంక్షన్ లో మరోసారి మావోయిస్టుల లేఖలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. గరువారం ఉదయం వాజేడు మండలంలోని జగన్నాథపురం జంక్షన్ లో ఈ లేఖలు ప్రత్యక్షమయ్యాయి. కాగా, గ్రామాల్లో త్వరలోనే వ్యవసాయం విప్లవం రాబోతుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ లేఖల ద్వారా మావోయిస్టులు హెచ్చరించారు.
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండల పరిధిలోని చంటేయపల్లిలో దారుణం చోటు చేసుకుంది. స్కూల్ బస్సు కింద పడి చిన్నారి మృతి చెందాడు. ఆన్నయ్యను స్కూల్ బస్సు ఎక్కించడానికి తల్లితోపాటు వచ్చిన బాలుడు ఆడుకుంటూ బస్సు ముందుకు వెళ్లాడు. బస్సు డ్రైవర్ గమనించకుండా వెళ్లడంతో బస్సుక్రింద పడ్డ బాలుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ములుగు ఎమ్మెల్యే సీతక్కకు బిగ్ షాక్ తగిలింది. సీతక్క ముఖ్య అనుచరులు బీఆర్ఎస్లో చేరారు. వారిని జడ్పీ చైర్ పర్సన్ నాగజ్యోతి కండువా పార్టీలోని ఆహ్వానించారు.
ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిపై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ కాంగ్రెస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఏంటని ప్రశ్నించారు.
వరంగల్ భూమి కంపించింది. శుక్రవారం తెల్లవారుజామున 4.43గంటలకు భూకంపం వచ్చింది. దీని తీవ్ర త రిక్టర్ స్కేలుపై 3.6గా నమోదు అయ్యిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCR)వెల్లడించింది.
సీఎం కేసీఆర్ తనకే మూడోసారి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తెలిపారు. మూడోసారి రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. గత 5 ఏళ్లుగా నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసినట్లు ఎమ్మెల్యే వివరించారు.