BRS: కేసీఆర్‌కు బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి సిట్టింగ్ ఎంపీ
కవిత అరెస్టై 24 గంటల కాకముందే కేసీఆర్ కు మరో షాక్ తగిలింది. మరో ఎంపీ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. వరంగల్ సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు.
కవిత అరెస్టై 24 గంటల కాకముందే కేసీఆర్ కు మరో షాక్ తగిలింది. మరో ఎంపీ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. వరంగల్ సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు.
మావోయిస్టు జ్యోతక్క అడవిబాట విడనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 54 ఏళ్ల వయసున్న జ్యోతక్క అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నందునే జనజీవనస్రవంతిలో కలిసేందుకు నిర్ణయించుకున్నట్లు సన్నిహిత వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఆమె వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం బుధరావుపేట నివాసి.
లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచే మరో ఇద్దరు ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు మాజీ సీఎం కేసీఆర్. చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్, వరంగల్ ఎంపీ టికెట్‌ను కడియం శ్రీహరి కూతురు కావ్యకు కేటాయించారు.
తనను బీఆర్ఎస్ నేతలు కిడ్నాప్ చేశారంటూ జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టారు మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్. తనను ఎవరు కిడ్నాప్ చేయలేదని అన్నారు. తమ పార్టీ నేతలతో కలిసి కేసీఆర్ వద్దకు వచ్చినట్లు తెలిపారు. తాను బీఆర్ఎస్ లోనే ఉంటానని తేల్చి చెప్పారు.
మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఇంటి దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొంది. బీజీపీలోకి వెళ్లొద్దంటూ బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు బుజ్జగింపులు మొదలుపెట్టారు. దీంతో బీజేపీ, బీఆర్ఎస్ కార్యకర్తలు పొటాపోటిగా నినాదాలు చేశారు. హరీష్‌రావు ఆదేశాలతో రమేష్ ను హైదరాబాద్ తీసుకొచ్చారు.
కేసీఆర్‌కు లోక్ సభ ఎన్నికల వేళ మరో ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. తాజాగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ కు రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆయన మూడు రంగుల జెండా కప్పుకోనున్నట్లు సమాచారం.
వరంగల్ లో వరుడి మిస్సింగ్ కేసు విషాదాంతంగా ముగిసింది. పెళ్లి పత్రికలు పంచడానికి వెళ్లి అదృశ్యమైన హనుమకొండకు చెందిన కృష్ణ తేజ్ మృతి చెందాడు. ఈ నెల 16న నర్సంపేటకు చెందిన యువతితో కృష్ణతేజకు వివాహం నిశ్చయించారు. యువకుడి మృతిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీలో చేరనున్నారు. ఈరోజు అమిత్ షాతో ఆయన భేటీ అయ్యారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా వరంగల్ నుంచి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది.
మహిళలను కోటీశ్వరులను చేయాలనేది సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం అని మంత్రి సీతక్క అన్నారు. కానీ స్త్రీలను కాంగ్రెస్ కు దూరం చేయాలని ఎమ్మెల్సీ కవిత ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ తెచ్చిన జీవో నెం 3 రద్దు చేయాలని కవిత చెప్పడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.