Nikhat Zareen: బాక్స‌ర్ నిఖ‌త్ జ‌రీన్‌కు డీఎస్పీ ఉద్యోగం

తెలంగాణ అమ్మాయి, బాక్సర్ నిఖత్ జరీన్‌కు ప్రభుత్వం పెద్ద ఉద్యోగంతో సత్కరించింది. ఆమెను డీఎస్పీగా నియమిస్తున్నట్టు చెప్పింది. తెలంగాణ డీజీపీ జితేంద‌ర్ చేతుల మీదుగా డీఎస్పీగా నిఖత్ ఈరోజు నియామ‌క ప‌త్రం అందుకున్నారు.

author-image
By Manogna alamuru
New Update
boxer

Nikhat Zareen: తెలంగాణలోని వరంగల్ కు చెందిన బాక్సర్ నిఖత్ జరీన్. ఈమె బాక్సర్‌‌గా దేశానికి ఎన్నో పతాకలను అందించింది. ఒలింపిక్స్‌లో కూడా పాల్గొంది. అందుకే తెలంగాణ ప్రభుత్వం నిఖత్‌కు గౌరవం ఇస్తూ రాష్టంలో పెద్ద ఉద్యోగాల్లో ఒకటైన డీఎస్పీ పదవిని ఆమెకు ఆఫర్ చేసింది. ఈరోజు బాక్సర్ నిఖత్ డీజీపీ జితేంద‌ర్ చేతుల మీదుగా డీఎస్పీగా నియామ‌క ప‌త్రం అందుకున్నారు. మూడేళ్ల పాటు ప్రొబెష‌న‌రీ ట్రైనింగ్‌ లో ఉంటారు. ఆ తరువాత పదవీ భాధ్యతను చేపడతారని డీజీపీ జితేదర్ తెలిపారు. గ‌త నెల 1వ తేదీన జ‌రిగిన కేబినెట్ స‌మావేశంలో సెక్ష‌న్ 4లోని తెలంగాణ రెగ్యులేష‌న్ ఆఫ్ అపాయింట్‌మెంట్స్‌కు స‌వ‌ర‌ణ చేసి నిఖ‌త్‌కు ఉద్యోగం ఇవ్వాల్సిందిగా హోంశాఖ‌ను ప్ర‌భుత్వం ఆదేశించింది.

Also Read: Telangana: జమిలీ ఎన్నికలకు మేం వ్యతిరేకం– అసదుద్దీన్ ఓవైసీ

Advertisment
Advertisment
తాజా కథనాలు