Medigadda Barrage: మేడిగడ్డ అందుకే కుంగింది.. విజిలెన్స్ రిపోర్ట్ లో సంచలన అంశాలు! TG: మేడిగడ్డ బ్యారేజీకి ఫౌండేషన్ లాంటి సీకెంట్ పైల్స్ ఫెయిల్ అవ్వడం వల్లే బ్యారేజీ కుంగిందని విజిలెన్స్ నివేదిక తేల్చింది. వాటిని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోవడం వల్లే దానికి నష్టం జరిగిందని పేర్కొంది. 2019లోనే ఈ బ్యారేజి డ్యామేజీ అయినట్లు తెలిపింది. By V.J Reddy 29 Oct 2024 in తెలంగాణ వరంగల్ New Update షేర్ చేయండి Medigadda Barrage: మేడిగడ్డ బ్యారేజి కుంగిపోవడానికి అసలు కారణాలను విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వెల్లడించింది. 2019లోనే ఈ బ్యారేజిలో నీళ్లు నింపే సమయంలో బుంగలు ఏర్పడ్డాయని, ఏడో నెంబర్ బ్లాక్ కింది ఉన్న ఇసుక కొట్టుకుపోవడమే మేడిగడ్డ బ్యారేజి కుంగిపోవడానికి ప్రధాన కారణమని స్పష్టం చేసింది. ఈ బ్యారేజీని గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2019 జూన్ నెలలో ప్రారంభించిందని తెలిపింది. కాగా అదే ఏడాది నవంబర్ లో వచ్చిన వరదల కారణంగా.. బ్యారేజి దెబ్బతిందని పేర్కొంది. వరద నీరును బ్యారేజిలో నిలువ ఉంచేందుకు గేట్లు ముయ్యగా.. దిగువ భాగంలో కాంక్రీట్ బ్లాకులు, ఆప్రాన్లు దెబ్బతిన్నట్లు తెలిపింది. ఇది కూడా చదవండి: నేడు సొంత జిల్లాలో జగన్ పర్యటన అధికారుల నిర్లక్ష్యం... బ్యారేజి దెబ్బ తిన్న అధికారులు పట్టించుకోలేదని పేర్కొంది. అధికారులు దెబ్బతిన్న బ్యారేజీకి కనీసం రిపేర్లు కూడా చేయలేదని మండిపడింది. అధికారుల నిర్లక్ష్యం వల్లే 2023 అక్టోబర్ నెలలో బ్యారేజీలోని ఏడో బ్లాకు కుంగిపోయిందని తేల్చి చెప్పింది. మూడు బ్యారేజిలు కుంగిపోవడానికి దాదాపు 15 మంది అధికారులే కారణమని పేర్కొంది. ప్రజాధనానికి నష్టం కలిగించిన ఆ 15 మంది అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఇది కూడా చదవండి: సీఎం రేవంత్‌కు ముప్పు.. సెక్యూరిటీ మార్పు! నకిలీ పత్రాలు... మొత్తం మూడు బ్యారేజీలు అధికారులో నిర్లక్ష్యం వల్లే విఫలమయయ్యాని నివేదిక చెప్పింది. అంతే కాకుండా.. ముందుగా అనుకున్న డిజైన్ పద్దతిలో బ్యారేజీ నిర్మాణ పనులు చేపట్టలేదని పేర్కొంది. మేడిగడ్డలో కుంగిన బ్లాక్-7కి సంబంధించిన పియర్ల కింద ఉన్న పునాది (ర్యాఫ్ట్), ర్యాఫ్ట్ దిగువన భూగర్భంలో ఉండే సీకెంట్ పైల్స్‌ను కూడా కరెక్ట్ పద్ధతిలో నిర్మించలేదని చెప్పింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పనులు పూర్తి కాకపోయినా పూర్తయినట్లు సర్టిఫికెట్లు జారీ చేసినట్లు తెలిపింది. ఇది కూడా చదవండి: కేరళ సీఎం కాన్వాయ్‌కు ఘోర ప్రమాదం కాళేశ్వరంలో అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ బ్యారేజీల నిర్మాణ పనులు పూర్తి కాకపోయునా 2019 సెప్టెంబరు 10న దాదాపు పూర్తైనటు సబ్‌స్టాన్షియల్ కంప్లీషన్ సర్టిఫికెట్ జారీ చేసినట్లు వెల్లడించింది. పనులు పూర్తికాకున్నా పూర్తైనట్టు ధ్రువీకరిస్తూ 2021 మార్చి 15న మళ్లీ పనుల పూర్తి ధ్రువీకరణ పత్రం జారీ చేసినట్లు పేర్కొంది. బ్యాంకు గ్యారంటీల విడుదలలోనూ నిబంధనలు పాటించలేదని నివేదికలో పేర్కొన్నారు. ఈ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించారు. కాగా దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. ఇది కూడా చదవండి: బాంబ్ బెదిరింపులు.. 62 విమానాలు రద్దు! #brs #floods #medigadda-barrage మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి