Mulugu: వాజేడు ఎస్సై ఆత్మహత్య కేసు...పోలీసుల అదుపులో యువతి! ములుగు జిల్లా వాజేడు ఎస్సై రుద్రారపు హరీశ్ ఆత్మహత్య ఘటనలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి.హానీట్రాప్ కారణంగానే ఎస్సై ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది.దీంతో దానికి కారణమైన సూర్యాపేటకు చెందిన యువతిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. By Bhavana 05 Dec 2024 in తెలంగాణ ఆదిలాబాద్ New Update షేర్ చేయండి ములుగు జిల్లా వాజేడు ఎస్సై రుద్రారపు హరీశ్ ఆత్మహత్య ఘటనలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి.తమ శాఖకు చెందిన యువ అధికారి సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడ్డ ఘటనను తీవ్రంగా పరిగణించిన పోలీసులు దర్యాప్తులో అనేక విషయాలు గుర్తించినట్లు సమాచారం. ఏడు నెలల కిందట హరీశ్ ఫోన్ కు ఒక కాల్ వచ్చింది. Also Read: ఆదిత్య 369' సీక్వెల్ అనౌన్స్ చేసిన బాలయ్య.. హీరో ఎవరంటే? ఫలానా వ్యక్తేనా అంటూ ఓ యువతి ఆరా తీయడంతో వీరిమధ్య మాటలు కలిశాయి. ఆమె ఇన్‌స్టా గ్రామ్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టడంతో హరీశ్ కూడా అంగీకరించాడు. అప్పటి నుంచి ఇన్ స్టా ద్వారా ఛాటింగ్ చేసుకునేవారు. హైదరాబాద్ లో చదువుకునే ఆమె వారాంతపు సెలవుల్లో వాజేడుకు వచ్చి..రెండు రోజులు ఉండేది. ఈ క్రమంలోనే ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆమె గురించి ఆరా తీసిన ఎస్సైకి ఆమె గురించి కొన్ని విషయాలు తెలిశాయి. Also Read: US: భారతీయులకు అలర్ట్...హెచ్-1బీ వీసా లిమిట్‌పై అప్‌డేట్! సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలానికి చెందిన ఆ 26 ఏళ్ల యువతి ఊర్లో ఉన్నప్పుడే ముగ్గురు యువకులతో స్నేహం గా ఉండేది. ఒకరు పెళ్లికి నిరాకరించడంతో చిలుకూరు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. ఇది తెలుసుకున్న హరీశ్ ఆమె పెళ్లి ప్రతిపాదనను నిరాకరించి ఇంట్లో వాళ్లు చూసిన సంబంధం చేసుకునేందుకు సిద్దమయ్యాడు. Also Read: PUshpa-2:వరల్డ్ వైడ్‌గా స్పెషల్ షోస్..బొమ్మ బ్లాక్ బస్టర్ అంటున్న ఫ్యాన్స్ అదే విషయం ఆమెకు చెప్పడంతో మాట్లాడేందుకు ఆదివారం సాయంత్రం వాజేడు ముళ్లకట్ట సమీపంలోని రిసార్టుకు వచ్చినట్లు దర్యాప్తులో వెల్లడైంది.అక్కడే ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. సెటిల్ మెంట్ చేసుకోవడానికి ఎస్సై ప్రయత్నించారని..ఇందుకు సదరు యువతి ఒప్పుకోకపోవడంతో పాటు ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు చెబుతాననడంతో హరీశ్ మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు తేలింది. Also Read: BIG BREAKING: ‘పుష్ప2’ ప్రీమియర్‌కు ముందు పోలీసుల లాఠీ ఛార్జ్! తమ కుమారుడి మృతికి ఆ యువతి కారణమంటూ హరీశ్ తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి